Megastar Chiranjeevi – Roja: అల్లూరి జయంతోత్సవాల్లో ఆసక్తికర దృశ్యం.. మెగాస్టార్‏తో మంత్రి రోజా సెల్ఫీ..

ఈ క్రమంలోనే ప్రధాని మోడీతోపాటు సీఎం జగన్‏తో కలిసి సెల్ఫీ తీసుకున్నారు రోజా. ఈ సన్నివేశం ఈ సీన్ చాలా ప్రత్యేకంగా నిలిచింది.

Megastar Chiranjeevi - Roja: అల్లూరి జయంతోత్సవాల్లో ఆసక్తికర దృశ్యం.. మెగాస్టార్‏తో మంత్రి రోజా సెల్ఫీ..
Megastar Roja

Edited By:

Updated on: Jul 04, 2022 | 3:10 PM

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాలు భీమవరంలో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు ప్రధాని మోడీతోపాటు.. బీజేపీ అగ్రనాయకులు.. పలువురు ప్రముఖులతోపాటు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు. ఈ వేడుకలలో పాల్గొన్న ప్రధాని అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ప్రధాన మంత్రి స్పీచ్ అనంతరం ఈ వేడుకలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మంత్రిగా ప్రధాని మోడీ వేదికపై పాలుపంచుకోవడానికి రోజాకు సైతం అవకాశం లభించింది.  వేదికపై అంతా తానే వ్యవహరించారు. ప్రధాని మోడీ సహా ముఖ్య అతిథులను సాదరంగా ఆహ్వానించారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవితో సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీతోపాటు సీఎం జగన్‏తో కలిసి సెల్ఫీ తీసుకున్నారు రోజా. ఈ సన్నివేశం ఈ సీన్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఆ తర్వాత వేదిక పై నుంచి కిందకు దిగిన తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి సెల్ఫీ తీసుకున్నారు రోజా.