Minister RK Roja: మంత్రి ఆర్కే రోజాకు అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చికిత్స..

|

Jun 11, 2023 | 11:57 AM

సౌత్ ఇండస్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. 90వ దశకంలో దక్షిణాదిలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్స్ హీరోల సరసన నటించిన ఆమె..ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ ఆర్కే సెల్వమణిని వివాహం చేసుకున్నారు.

Minister RK Roja: మంత్రి ఆర్కే రోజాకు అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చికిత్స..
Roja
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి… సీనియర్ హీరోయిన్ ఆర్కే రోజా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. శనివారం రాత్రి చెన్నైలోని క్రిమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులు క్రితం ఆమెకు కాలు బెణకడంతో వారం రోజులపాటు ఫిజియథెరపీ చేయించారు. అయినా నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే 10 రోజులుగా నియోజవర్గ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు రోజా. ప్రస్తుతం ఆమె పర్యాటక, సాంస్కృతిక యువజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

సౌత్ ఇండస్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. 90వ దశకంలో దక్షిణాదిలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్స్ హీరోల సరసన నటించిన ఆమె..ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ ఆర్కే సెల్వమణిని వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలలో అనేక చిత్రాల్లో నటించింది. రోజా, ఆర్కే సెల్వమణి దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న రోజా.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.