ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ .. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాల్లో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగులకు వెళ్లేందుకు శరీరం ఏ మాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నారీ కామెడి విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిక్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురికావడంతో పాటు వెంకట్ రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు.