Anushka Shetty Spotted Hyderabad: యోగా టీచర్ నుంచి నటిగా మారి దక్షిణాదిన ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న చిన్నది అనుష్క. నాగార్జున మూవీ సూపర్ తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి, యోగా టీచర్. అక్కినేని నాగ చైతన్య కు స్నేహితురాలు. ఆ స్నేహంతో నాగ్ సినిమాలో అవకాశం వచ్చింది. అరుంధతి సినిమాతో అనుష్క పేరు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో మోగింది. భాగమతి, రుద్రమదేవి, వంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకు కేరాఫ్ అడ్రస్ గా నిలించింది కన్నడ సోయగం. కరోనా నేపథ్యంలో అనుష్క దాదాపు కెమెరాకు దూరంగా ఉంది. అయితే హఠాత్తుగా అనుష్క హైదరాబాద్ లో దర్శనం ఇచ్చింది. చాలా రోజుల తర్వాత స్వీటీ హైదరాబాద్‌లో కనిపించడంతో మీడియా తమ కెమెరాలకు పనిచెప్పారు. దీంతో అనుష్క ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. నిశ్శబ్దం మూవీ తర్వాత అనుష్క మరో సినిమాకు సైన్ చేసినట్లు ఎక్కడా వార్తలు వినిపించడం లేదు. మెగాస్టార్ మూవీలో హీరోయిన్ అనే పుకార్లు షికారు చేసినా అవి కార్య రూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం స్వీటీ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఉన్న దేవాలయాలని వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read: నాజీవితంలో 30 ఏళ్ళు గడిపాను, అంటూ తన కలలు కోరికలను లెటర్ లో ఆవిష్కరించిన సుశాంత్