నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అతడికి అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటిస్తోంది. ఇక ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఆ ట్రైలర్‌లో హీరోహీరోయిన్ల మధ్య కిస్ సీన్స్ ఉన్నాయంటూ మేకర్స్ రివీల్ చేశారు. అలాగే ఈ సినిమాలో దాదాపు 5 లిప్‌లాక్ సీన్స్ ఉన్నట్లు ఓ టాక్ నడుస్తోంది.
ఇంకేముంది.. ఇన్నాళ్లు తన అభిమాన హీరోయిన్‌ను పద్దతిగా చూసిన ఫ్యాన్స్‌కు.. ఆ సీన్ అస్సలు నచ్చలేదు. సోషల్ మీడియా వేదికగా అనుపమను మీమ్స్‌తో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘నీకు వ్యక్తిగత ఇమేజ్ లేదా.. రెమ్యునరేషన్ కోసం ఇంతకు దిగజారుతావా.. కొత్త కుర్రాళ్లతో ఇలా నటిస్తావా’ అంటూ ఓ ఆటాడేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా లిప్‌లాక్ సీన్‌పై వచ్చిన మీమ్స్‌కు హీరోహీరోయిన్లు ఆశిష్, అనుపమ స్పందించారు. మొదటి ఇద్దరూ ఆ మీమ్స్ చూసి నవ్వుకోగా.. ఆ తర్వాత తన ఫ్యాన్స్ ఫీలింగ్స్‌ను హార్ట్ చేసినందుకు అనుపమ సారీ చెప్పింది. ఇకపై ఆశిష్‌ను టచ్ చేయనంటూ క్లారిటీ ఇచ్చింది. సినిమాలో లిప్‌లాక్ సీన్ల ఎందుకున్నాయో మీకు మూవీ చూశాక అర్ధమవుతుందని అనుపమ స్పష్టం చేసింది. కాగా, ఈ చిత్రానికి శ్రీహర్ష కన్నెగంటి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.
Also Read:
వీరు జామపండ్లను అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి!
ఈ ఫోటోలో పులి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్!
పాముతో గేమ్సా.. క్షణాల్లో కాటేసింది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!