Pelli SandaD: పెళ్లిసందD నుంచి రాఘవేంద్ర రావు మార్క్‌లో మరో రొమాంటిక్ సాంగ్….

| Edited By: Ravi Kiran

Oct 14, 2021 | 6:32 AM

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ దర్శకత్వం వహిస్తున్న సినిమా పెళ్ళిసందడి.

Pelli SandaD: పెళ్లిసందD నుంచి రాఘవేంద్ర రావు మార్క్‌లో మరో రొమాంటిక్ సాంగ్....
Gandharva
Follow us on

Pelli SandaD: దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ దర్శకత్వం వహిస్తున్న సినిమా పెళ్ళిసందడి. సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. శ్రీలీల ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఇప్పటివే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాఘవేంద్ర రావు చాలా కాలం గ్యాప్ తర్వాత దర్శకత్వ పర్యవేక్షణ అందించడమే కాకుండా కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ సినిమానుంచి మరో అందమైన పాటను విడుదల చేశారు. కీరవాణి బాణీలను సమకూర్చగా.. ఈపాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక తాజాగా విడుదల చేసిన పాట రాఘవేంద్ర రావు మార్క్ కనిపిస్తుంది. గంధర్వలోకం.. అంటూ సాగే ఈ పాట చాలా రొమాంటిక్ గా ఉంది. ఈ పాటలో హీరోయిన్ ముఖాన్ని చూపించకుండా దాచారు. ఈ పాట అచ్ఛం శ్రీకాంత్ నటించిన పెళ్ళిసందడి సినిమాలో సౌందర్య లహరి పాట మాదిరిగానే ఉంది. ఆ పాటలోనూ హీరోయిన్ ముఖాన్ని చూపించకుండా చిత్రీకరించారు రాఘవేంద్రరావు. ఈ పాట పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tamosoma jyothirgamaya: నేత కార్మికుల జీవన స్థితికి అద్దంపట్టే మూవీ ‘తమసోమా జ్యోతిర్గమయ’ ప్రతి ఒక్కరూ చూడాలని కేటీఆర్ పిలుపు

Manchu Vishnu: ‘MAA’ లో కొనసాగుతున్న చిటపటలు.. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేయబోతున్నారు?

Rakul Preet Singh: స్విమ్మింగ్ పూల్‌లో రకుల్ ప్రీత్‌ జలకాలాట.. తిరిగి ఆ రోజుల్లోకి వెళ్లాలని ఉందంటా..