Jr NTR: ఎన్టీఆర్ -కొరటాల శివ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..? తారక్ డాన్స్‌‌‌తో దుమ్ములేపడం ఖాయం..

|

Aug 13, 2021 | 5:41 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది...

Jr NTR: ఎన్టీఆర్ -కొరటాల శివ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..? తారక్ డాన్స్‌‌‌తో దుమ్ములేపడం ఖాయం..
Ntr
Follow us on

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌‌లో ఈ సినిమా పాటను షూట్ చేస్తున్నారు. దాంతో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరిగా, తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గతంలో ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సోషల్ మెసేజ్‌‌‌‌‌‌తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌తో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది.

ఇక ఇప్పుడు మరో సారి ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారని తెలిసి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్- కొరటాల సినిమాలో హీరోయిన్‌‌‌గా కియారా అద్వానీ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించే అనిరుధ్ ఎన్టీఆర్ సినిమాకు సంగీతం అందించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని కూడా పూర్తయింది. ప్రస్తుతం ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక త్వరలోనే అనిరుధ్ పేరును అఫీషియల్‌‌‌‌గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..