War2- Coolie Movie: కూలీ, వార్ 2 సినిమా టికెట్ల ధరల పెంపు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

ఈ వారం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ జరగనుంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. రజనీకాంత్ కూలీతో పాటు హృతిక్ రోషన్- ఎన్టీఆర్ ల వార్ 2 మూవీ కూడా ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది.

War2- Coolie Movie: కూలీ, వార్ 2 సినిమా టికెట్ల ధరల పెంపు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..
War 2, Coolie Movie

Updated on: Aug 12, 2025 | 9:51 PM

ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు కూలీ, వార్‌2 సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. రజనీకాంత్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు కావడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్ లో ఈ సినిమాల టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మంగళవారం (ఆగస్టు 12)సాయంత్రం నుంచే ఈ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. బుక్‌మై షో, డిస్ట్రిక్ట్‌ యాప్‌లలో కూలీ, వార్ 2 సినిమాల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఈ రెండు క్రేజీ సినిమాల టికెట్లను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేరకు మంగళవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కూలీ సినిమా విడుదల రోజు అదనపు షోకు (ఉదయం 5 గంటలు) ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది. మరోవైపు, సింగిల్స్‌ స్క్రీన్స్‌లో రూ.75 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 23 వరకూ ఈ ధరలు అమలులో ఉండనున్నాయి. వార్‌ 2 సినిమాకూ ఇవే ధరలు, నిబంధనలు అమలు కానున్నాయి.

 

ఇవి కూడా చదవండి

అయితే తెలంగాణలో టికెట్‌ ధరల పెంపు లేదు. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.175కు, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మార్నింగ్‌ షో కన్నా ముందు కేవలం ఒక్క షోకు మాత్రమే అనుమతి లభించినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా థియేటర్‌లకు అనుమతి ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్‌ షోను ప్రదర్శించనున్నారు.

అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం..

వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.