Vishnu Priya: ‘మరో జన్మంటూ ఉంటే నీ కూతురిగానే పుడతాను’.. అమ్మను గుర్తుకు తెచ్చుకుని విష్ణుప్రియ ఎమోషనల్‌​

ఆన్‌ స్క్రీన్‌ అయినా, ఆఫ్‌ స్క్రీన్‌ అయినా ఎంతో చలాకీగా, సరదాగా ఉండే విష్ణుప్రియ జీవితంలో ఇటీవలే ఒక తీరని విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి లో ఆమె తల్లి కన్నుమూసింది. అప్పటినుంచి పలు సందర్భాల్లో తన తల్లి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ భావోద్వేగానికి లోనవుతోందీ స్టార్‌ యాంకర్.

Vishnu Priya: మరో జన్మంటూ ఉంటే నీ కూతురిగానే పుడతాను.. అమ్మను గుర్తుకు తెచ్చుకుని విష్ణుప్రియ ఎమోషనల్‌​
Anchor Vishnu Priya

Updated on: May 12, 2023 | 6:08 AM

స్టార్‌ యాంకర్‌ విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట షార్ట్‌ ఫిల్మ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ యాంకరింగ్‌తో క్రేజ్‌ సొంతం చేసుకుంది. సుడిగాలి సుధీర్‌తో ఆమె చేసిన ‘పోవే పోరా’ షో బుల్లితెరపై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆతర్వాత టీవీషోస్‌, ఈవెంట్లతో బిజీగా మారిపోయింది. స్మాల్‌ స్క్రీన్‌పైనే బిజీగా ఉంటూనే సిల్వర్ స్క్రీన్‌పైనా సత్తాచాటింది. ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’, ‘చెక్ మేట్’ ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ అనే సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం ప్రైవేట్‌ ఆల్బమ్‌ సాంగ్స్‌తో బిజీగా ఉంటోంది విష్ణుప్రియ. ఇటీవల నటుడు మానస్‌తో కలిసి ఆమె చేసిన గంగులు సాంగ్‌ కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అంతకుముందు వీరిద్దరూ కలిసి నటించిన జరీ జరీ పంచెకట్టి అనే సాంగ్‌ కూడా బాగా హిట్‌ అయ్యింది. ఇక సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉండే ఈ సొగసరి తన హాట్‌ ఫొటోలు, డ్యాన్స్‌ వీడియోలను షేర్ చేస్తుంటుంది. కాగా ఆన్‌ స్క్రీన్‌ అయినా, ఆఫ్‌ స్క్రీన్‌ అయినా ఎంతో చలాకీగా, సరదాగా ఉండే విష్ణుప్రియ జీవితంలో ఇటీవలే ఒక తీరని విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి లో ఆమె తల్లి కన్నుమూసింది. అప్పటినుంచి పలు సందర్భాల్లో తన తల్లి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ భావోద్వేగానికి లోనవుతోందీ స్టార్‌ యాంకర్. సోషల్‌ మీడియా వేదికగా కూడా పలుసార్లు ఎమోషనల్‌ పోస్టులు షేర్‌ చేసింది.

 

ఇవి కూడా చదవండి

తాజాగా మదర్స్‌డే సందర్భంగా నిర్వహించిన ఓ టీషోలో మరోసారి తన తల్లిని గుర్తుచేసుకుంది విష్ణుప్రియ. స్టేజిమీదకు వచ్చి బోరున ఏడ్చేసింది. ఇంకో జన్మంటూ ఉంటే నీ కూతురుగా పుడుతానమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఐలవ్ యూ.. ఐలవ్ యూ’ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. దీంతో షోకు హాజరరైన వారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు విష్ణుప్రియకు ధైర్యం చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసంక్లిక్ చేయండి..