Vishnu Priya: అక్క ప్లీజ్.. సబ్ స్క్రిప్షన్ రేట్ తగ్గించు.. మాకు జాబ్ లేదు.. నెటిజన్ కామెంట్‌కు విష్ణుప్రియ రిప్లై ఇదే..
బుల్లితెరపై గ్లామర్ క్వీన్, యాంకర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది విష్ణుప్రియ. పలు షోలలో హోస్టింగ్ ద్వారా అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక ఇటీవల సబ్‌స్ర్కిప్షన్ ద్వారా వార్తలలో నిలిచింది. ఇప్పుడు మరోసారి సబ్‌స్ర్కిప్షన్ రేట్ పై విష్ణు ప్రియ చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఓవైపు స్మాల్ స్ర్కీన్ పై సందడి చేస్తున్నఈ అమ్మడు.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే ఈమధ్యకాలంలో ఆమె పేరు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఇటీవల ఇన్ స్టాలో సబ్‌స్ర్కిప్షన్ అనే ఆప్షన్ పెట్టి.. అందులో ఆమెకు సంబంధించిన గ్లామర్ క్వీన్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తుంది. అయితే అందులో ఆమె పెట్టే ఫోటోస్, వీడియో పై ఇదివరకే పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయినప్పటికీ విష్ణుప్రియ ఏమాత్రం వెనకడుగు వెయకుండా సబ్‌స్ర్కిప్షన్ మాత్రం కొనసాగిస్తూనే ఉంది. అంతేకాదు.. ఈ వివాదం తర్వాత ఆమె సబ్‌స్ర్కిప్షన్ వినియోగదారుల సంఖ్య మరింత పెరిగింది.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..
తాజాగా విష్ణుప్రియ సబ్‌స్ర్కిప్షన్ ఆప్షన్ పై నెటిజన్ చేసిన కామెంట్.. దానికి విష్ణు ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. “అక్కా.. సబ్‌స్ర్కిప్షన్ ప్రైజ్ కాస్త తగ్గించండి.. ప్లీజ్.. నాతోపాటు మా స్నేహితులు కూడా జాయిన్ అవుతాం. దయచేసి మా గురించి ఆలోచించండి. మేము జాబులేని కుర్రాళ్లం “అంటూ కామెంట్ చేశాడు ఓ నెటిజన్. ఇది చూసిన విష్ణుప్రియ క్రేజీగా రిప్లై ఇచ్చింది. “అయ్యో.. అవునా.. అయితే చదువు మీద శ్రద్ద పెట్టండి. డబ్బు వృధా చేసుకోవద్దు” అంటూ రిప్లై ఇచ్చారు. అంటే రేట్ తగ్గించే ప్రసక్తే లేదు అని చెప్పకనే చెప్పింది.
ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..
ప్రస్తుతం ఒక్క సబ్‌స్ర్కిప్షన్ కి విష్ణుప్రియా ఏకంగా నెలకు రూ.390 తీసుకుంటుంది. ఇప్పటివరకు ఆమెకు 6742 మంది సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. అంటే సినిమాల్లో హీరోయిన్ల కంటే ఎక్కువగా కేవలం సోషల్ మీడియా ద్వారానే విష్ణు ప్రియ సంపాదిస్తుంది. ప్రస్తుతం విష్ణు షేర్ చేసిన పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
విష్ణుప్రియ పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..
