Rashmi Gautam: హిందూ వ్యతిరేకివి అన్న నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మీ..

| Edited By: Ram Naramaneni

Sep 02, 2022 | 7:29 AM

అందం చలాకీ తనం కలబోసిన ముద్దగుమ్మ రష్మీ. ప్రస్తుతం స్టార్ యాంకర్ గా రాణిస్తూ బుల్లితెరపై సందడి చేస్తోంది రష్మీ. పలు టీవీషోలో యాంకర్ గా చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తోంది ఈ భామ.

Rashmi Gautam: హిందూ వ్యతిరేకివి అన్న నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మీ..
Rashmi Gautam
Follow us on

అందం చలాకీ తనం కలబోసిన ముద్దగుమ్మ రష్మీ(Rashmi Gautam). ప్రస్తుతం స్టార్ యాంకర్ గా రాణిస్తూ బుల్లితెరపై సందడి చేస్తోంది రష్మీ. పలు టీవీషోలో యాంకర్ గా చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తోంది ఈ భామ. ఇక రష్మీ అందం, ఆమె అమాయకత్వం, హుషారయిన మాటలకు ప్రేక్షకులంతా ఫిదా అవుతుంటారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. రోజూ రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తుంది ఈ చిన్నది. అంతే కాదు.. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఓ నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

వినాయక చవితి సందర్భంగా ఓ భారీ వినాయక విగ్రహానికి ఓ గజరాజుతో పూలమాల వేయించారు కొందరు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై స్పందించింది రష్మీ. అయితే జంతు ప్రేమికురాలు అయిన రష్మీ స్పందిస్తూ.. అలా వినాయక విగ్రహం మేడలో పూల మాల వేసే స‌మ‌యంలో ఆ ఏనుగు ఎంత‌గా ఇబ్బంది ప‌డిందోనంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇలా మన సంతోషం కోసం జంతువులను ఉపయోగించకూడదు అంటూ ట్వీట్ చేసింది రష్మీ. రష్మీ ట్వీట్ పై ఒకొక్కరు ఒక్కొక్క స్పందించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం..మీరు జంతు ప్రేమికులేమీ కాద‌ని మాకు తెలుసు. మీరు హిందూ వ్య‌తిరేకులు అంటూ కామెంట్ చేశాడు. దీనికి రష్మీ స్పందిస్తూ.. నేను నంది, గోమాత‌ల‌ను గౌర‌విస్తాన‌ని. అందుకే  లెద‌ర్‌తో చేసిన వ‌స్తువు‌ల‌ను వాడను.. అంతేకాకుండా పాల ప‌దార్థాల‌ను కూడా తీసుకొను.. ఎందుకంటే పాల కోసం ఆవు త‌న జీవిత కాలంలో చాలా సార్లు గ‌ర్భం దాలుస్తోంద‌ని చెప్పుకొచ్చింది. అలాగే మహిళలు పిరియడ్ టైం లో చాలా నొప్పిని అనుభవిస్తారని అదికూడా నన్ను ఇబ్బంది పెడుతుంది అంటూ రష్మీ రాసుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి