Telugu News Entertainment Tollywood Anchor anasuya share a virtual letter to six years old teresa manimala who ask questions to society about gender in equally
Anasuya: ప్రపంచం అన్ని రంగాల్లో అద్భుతంగా దూసుకుపోతున్నా ఇప్పటికే సమాజంలో లింగ సమానత్వం ఉండడం లేదు. సొంత ఇంటిలోనే ఆడ, మగ మధ్య ఎన్నో తేడాలు ఉంటున్నాయి. మహిళలు.. పురుషులతో సమానంగా ఆ మాటకొస్తే కొన్ని సందర్భాల్లో ఓ అడుగు ముందుంటున్నా..
Anasuya: ప్రపంచం అన్ని రంగాల్లో అద్భుతంగా దూసుకుపోతున్నా ఇప్పటికే సమాజంలో లింగ సమానత్వం ఉండడం లేదు. సొంత ఇంటిలోనే ఆడ, మగ మధ్య ఎన్నో తేడాలు ఉంటున్నాయి. మహిళలు.. పురుషులతో సమానంగా ఆ మాటకొస్తే కొన్ని సందర్భాల్లో ఓ అడుగు ముందుంటున్నా.. ఇప్పటికే ఆడవారిపట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. సమాజానికి ఇలాంటి ప్రశ్నలే వేస్తోంది ఓ ఆరేళ్ల చిన్నారి. థెరెసా మణిమాల అనే ఓ ఆరేళ్ల చిన్నారి సోషల్ స్టడీస్ పాఠ్యపుస్తకంలో ‘మ్యాన్ మేడ్’ అనే పదాన్ని చదివింది. దీంతో తల్లిని ప్రశ్నిస్తూ.. ‘ఎందుకమ్మా ఎప్పుడూ మ్యాన్ మేడ్ అని రాస్తారు? పీపుల్ మేడ్ అని, ఉమెన్ మేడ్ అని ఎందుకు రాయరు. మహిళలు కూడా పెద్ద పెద్ద నిర్మాణాలను చేస్తున్నారు కదా? ఎందుకు ఈ వివక్ష అంటూ ప్రశ్నించింది’ దీంతో ఆరేళ్ల వయసున్న ఆ చిన్నారి చేసిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. వయసులో చిన్నదైనా చిన్నారి సమాజాన్ని ప్రశ్నిస్తోన్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో కొందరు ఆ చిన్నారికి మద్ధతుగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా నటి, యాంకర్ అనసూయ కూడా థెరెసాకు మద్ధతు పలికింది. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేసిన అనసూయ తన స్వీయ అనుభవాన్ని పంచుకున్నారు. చిన్నారి థెరెసాకు వర్చువల్ లెటర్ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో అనసూయ మాట్లాడుతూ.. ‘థెరెసా నీ ధైర్యం చూసి నాకు ఎంతో గర్వంగా అనిపించింది. నువ్వు నాకు స్ఫూర్తిని ఇచ్చావు. నేను ఎన్నో సార్లు ట్రోలింగ్, అవమానాలు ఎదుర్కొన్నాను. కానీ అవేవీ నన్ను ఆపలేవు. లింగ సమానత్వంపై అవగాహన రావాలంటే అది చిన్నతనంలో నుంచే అలవాటు చేయాలి. ముఖ్యంగా పాఠ్యపుస్తకాల్లో ఉపయోగించే పదజాలాన్ని మార్చాలి’ అని చెప్పుకొచ్చారు. ఇక జర్నలిస్టులు ప్రతీసారి ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రమా.? అని ప్రశ్నిస్తే.. మెన్ ఓరియెంటెడ్ చిత్రాలని మీరు వ్యాఖ్యానిస్తారా? అలా లేనప్పుడు ఉమెన్ ఓరియెంట్‌డ్ అని ఎందుకు అడుగుతారని అనసూయ ప్రశ్నించారు. ‘లింగసమానత్వం కోసం థెరెసా ప్రశ్తిస్తోన్న తీరు ఈ ప్రపంచాన్ని మారుస్తుందని నేను భావిస్తున్నాను. లింగసమానత్వం కోసం ఇక నుంచి నేను కూడా ప్రశ్నిస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు అనసూయ.