Anasuya: మరో ఛాలెంజింగ్ రోల్‏లో అనసూయ.. వెబ్ సిరీస్ కోసం యాంకరమ్మ సాహసం..

తాజా సమాచారం ప్రకారం అనసూయ ఇప్పుడు మరోసారి ఛాలెంజింగ్ పాత్రలో నటించేందుకు సిద్ధమైందట. ఇప్పటివరకు ఎన్నో విలక్షణమైన పాత్రలలో కనిపించిన యాంకరమ్మ..

Anasuya: మరో ఛాలెంజింగ్ రోల్‏లో అనసూయ.. వెబ్ సిరీస్ కోసం యాంకరమ్మ సాహసం..
Anasuya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2022 | 8:20 PM

బుల్లితెరపై యాంకర్ అనసూయకు (Anasuya) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు పలు రియాల్టీ షోలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు వెండితెరపై పలు చిత్రాలతో మెప్పించింది. విలక్షణమైన పాత్రలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ప్రశంసలు అందుకున్న ఆనసూయ.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలలో మెప్పించింది. ఇటీవల వచ్చిన పుష్ప మూవీలో దాక్షయాణి పాత్రలో నటించింది. ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా దర్జా. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఇక తాజాగా అనసూయ తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం అనసూయ ఇప్పుడు మరోసారి ఛాలెంజింగ్ పాత్రలో నటించేందుకు సిద్ధమైందట. ఇప్పటివరకు ఎన్నో విలక్షణమైన పాత్రలలో కనిపించిన యాంకరమ్మ.. ఇప్పుడు వేశ్వ పాత్రలో నటించనుందని టాక్. కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ లో అనసూయ వేశ్య పాత్రలో కనిపించనుందని..ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్. ఈ వెబ్ సిరీస్ కు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి స్క్రీప్ట్ అందిస్తున్నారని తెలుస్తోంది. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం అనే నాటకం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నారని.. ఇందులో అనసూయ మధురవాణి అనే వేశ్య పాత్రలో కనిపించనుందట. మరి నిజంగానే అనసూయ ఈ ఛాలెంజింగ్ రోల్ చేయబోతుందా ? లేదా ? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే