నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు తమ అభిమానులు, ఫాలోవర్లకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ పోస్టులు షేర్ చేశారు. అయితే స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మాత్రం తనను ద్వేషించే వారిందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒక డబ్ స్మాష్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆమె బూతులతో రెచ్చిపోయింది. ‘2023లో నా వల్ల ఎవరైతే ఇబ్బందిపడ్డారో.. నా మాటల ద్వారా, నా బిహేవియర్ ద్వారా ఎవరినైతే నేను బాధపెట్టానో అంటూ’ కాస్త గ్యాప్ ఇచ్చింది. దీంతో అనసూయ పశ్చాత్తపం పడుతుందని చాలామంది భావించారు. అయితే అదేమీ జరగలేదు. ఎప్పటిలాగే తనదైన శైలిలో తన హేటర్స్‌కు కౌంటర్ ఇచ్చింది. ‘ మీ అందరికీ.. మంచిగయ్యింది. ఇంకొకసారి నా జోలికి రావద్దు. నెక్ట్స్ ఇయర్ కూడా ఇలాగే రిపీట్ చేస్తే మాత్రం దూల తీర్చి దూపమేస్తాను’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. బహుశా తనను ద్వేషించేవారికి ఇన్ డైరెక్టుగా హెచ్చరికలు జారీ చేసింది అనసూయ. అయితే క్యాప్షన్‌లో మాత్రం ‘నేను జోక్ చేస్తున్నా.. సీరియస్ కాదు’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. కొందరు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెబుతుంటే, మరికొందరు మాత్రం ఎప్పటిలాగే తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం టీవీ షోలను బాగా తగ్గించేసిన అనసూయ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. గతేడాది సుమారు అరడజను సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల యాంకరమ్మ. మైఖేల్, రంగ మార్తండ, విమానం, పెద కాపు1, ప్రేమ విమానం సినిమాలు అనసూయకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ అందాల తార చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఒకటి. ఇందులో ద్రాక్షాయణి అనే పాత్రలో నటిస్తోందామె. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న పుష్ప2 విడుదల కానుంది. దీంతో పాటు ప్లాష్ బ్యాక్ సినిమాలో నటిస్తోందీ అందాల యాంకరమ్మ.
నూతన సంవత్సరం వేడుకల్లో అనసూయ ఫ్యామిలీ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.