Tollywood: గుర్తుపట్టారా..? అబ్బాయిలు ఆరాధించే, అమ్మాయిలు అసూయ పడే అందం ఆమెది..

|

Apr 17, 2024 | 6:37 PM

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు టాలీవుడ్​లో స్టార్ నటి. విభిన్న తరహా పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది. బుల్లితెరపై యాంకర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి.. స్టార్ స్టేటస్ అందుకుంది. ఇప్పుడు వెండితెరపైనా అంతే దూకుడుగా ముందుకు సాగుతోంది. తనెవరో మీరు కనిపెట్టగలరా..?

Tollywood: గుర్తుపట్టారా..? అబ్బాయిలు ఆరాధించే, అమ్మాయిలు అసూయ పడే అందం ఆమెది..
Actress Childhood Photo
Follow us on

ఈ మధ్య  సోషల్ మీడియాలో సెలబ్రిటీల అరుదైన, చిన్నప్పటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. వాటిని వారి అభిమానులు, నెటిజన్లు కూడా ఇంట్రస్ట్‌గా చూస్తూ ఇతరులకు షేర్ చేస్తున్నారు. అలాంటి ఓ ఫోటోను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో మీరు కనిపెట్టగలరా..? చిన్న క్లూ ఏంటి అంటే.. తను నటి కాక ముందు స్టార్ యాంకర్. ముద్దుగా, బొద్దుగా అందంగా ఉంటుంది. కాంట్రవర్సీల్లో చిక్కుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె సందడి మాములుగా ఉండదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫోటోషూట్స్‌తో తెగ హల్ చల్ చేస్తోంది.

మీరు కనిపెట్టేస్తే ఫైన్. ఇక మేమే చెప్పేస్తున్నాం.. తన స్టాన్ యాంకర్, నటి అనసూయ. ప్రస్తుతం టాలీవుడ్‌లో విభిన్న పాత్రలు చేస్తూ ముందుకు సాగుతోంది ఈ నటి. తొలుత యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. తనకంటూ సెపరేట్ మార్క్ సెట్ చేసుకుంది. జబర్దస్త్ వంటి హిట్ అవ్వడంలో అనసూయ పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. ఇక సినిమాల్లో బిజీ అయ్యాను అనుకున్న సమయంలో బుల్లితెరకు దూరంగా ఉంటుంది.

సుకుమార్​ డైరెక్షన్‌లో వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది అను. అనంతరం పుష్పలోనూ నెగటివ్ షేడ్స్​ పాత్రలో  మెరిసింది. యాత్ర,  మీకు మాత్రమే చెప్తా,  ఖిలాడీ, చావు కబురు చల్లగా, దర్జా మైఖేల్, విమానం, రంగమార్తాండ, పెద్ద కాపు, ప్రేమ విమానం, రజాకార్ వంటి సినిమాల్లో నటించింది. అటు మలయాళంలో మమ్ముట్టితో కలిసి భీష్మ పర్వంలోనూ నటించింది. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ నర్తించి.. వారెవ్వా అనిపించుకుంది.

సోషల్ మీడియాలో విభిన్న అంశాలపై రెస్పాండ్ అవ్వడం వల్ల.. అనూసూయ ట్రోల్ అవుతూ ఉంటారు.  వచ్చే ట్రోల్స్​ గురించి ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. తనకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్​ను షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా తన చిన్ననాటి ఫొటోను తాజా లుక్స్‌తొ ఓ వీడియోగా పోస్ట్ చేసింది. బ్యాక్​గ్రౌండ్​లో ఓ పాప్ సాంగ్ కూడా యాడ్ చేసింది. ఇది చూసిన చిన్నప్పుడు భలే క్యూట్‌గా ఉన్నావ్ అను కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.