Anasuya Bharadwaj: మరోసారి బోల్డ్ క్యారెక్టర్‌లో అనసూయ.. సుమతిగా మెప్పించనున్న రంగమ్మత్త..
జీవితంలో ఒక్కొక్కరికీ ఒక్కో కథ ఉంటుంది. ప్రతీ కథలోనూ హృదయాలను కదిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమతి అనే ఓ ఎమోషనల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్‌లో మెప్పించనుంది అనసూయ భరద్వాజ్.

జీవితంలో ఒక్కొక్కరికీ ఒక్కో కథ ఉంటుంది. ప్రతీ కథలోనూ హృదయాలను కదిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమతి అనే ఓ ఎమోషనల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్‌లో మెప్పించనుంది అనసూయ భరద్వాజ్. ఆమె కీలక పాత్రలో నటించిన ఎమోషనల్ జర్నీ ’విమానం’. జూన్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ‘విమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సోమవారం అనసూయ భరద్వాజ్ బర్త్ డే. ఈ సందర్భంగా విమానం మూవీ మేకర్స్ సుమతి పాత్రకు సంబంధించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో ఆమె అందంగా రెడీ అవుతుంది. అసలు ఆమె అలా రెడీ కావటానికి గల కారణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.




Thank you so much ?❤️?? https://t.co/pO68dD68cJ
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 15, 2023
‘విమానం’ చిత్రంలో వీరయ్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తుండగా సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు. అసలీ పాత్రల మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది తెలియాలంటే జూన్ 9 వరకు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తలు చదవండి..
