Anasuya Bharadwaj : రంగమ్మత్త కోసం స్పెషల్ రోల్ లో డిజైన్ చేస్తున్న సుకుమార్.. పుష్ప సినిమాలో అనసూయ

| Edited By: Rajitha Chanti

Apr 24, 2021 | 9:34 AM

స్మాల్ ఆర్ బిగ్... స్క్రీన్ ఏదైనా పాలసీ మాత్రం ఒక్కటే..! సెలక్షన్ ఆఫ్ రోల్స్ విషయంలో కూడా హుందాగా ఆలోచిస్తారు. కథలో మంచి ఫిమేల్ క్యారెక్టర్ రాసుకోగానే ఆర్టిస్ట్ గా ఆమెనే ఫస్ట్ ఛాయిస్

Anasuya Bharadwaj : రంగమ్మత్త కోసం స్పెషల్ రోల్ లో డిజైన్ చేస్తున్న సుకుమార్.. పుష్ప సినిమాలో అనసూయ
బుల్లితెరపైనా రాణిస్తుంది వెండి తెరపైన వెలుగుతున్న భామ అనసూయ. టీవీ షోలతో అలరిస్తూనే సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ బ్యూటీ. 
Follow us on

Anasuya Bharadwaj :

స్మాల్ ఆర్ బిగ్… స్క్రీన్ ఏదైనా పాలసీ మాత్రం ఒక్కటే..! సెలక్షన్ ఆఫ్ రోల్స్ విషయంలో కూడా హుందాగా ఆలోచిస్తారు.
కథలో మంచి ఫిమేల్ క్యారెక్టర్ రాసుకోగానే ఆర్టిస్ట్ గా ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కన్సిడర్ చేస్తున్నారు డైరెక్టర్లు. అందుకే.. దాదాపు 18 ఏళ్ల నుంచి ఫీల్డ్ లో ఉంటున్నా.. కెరీర్ లో యూనిఫామిటీని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఇంతకీ ఎవరామె?
అట్టా ఎట్టా పుట్టేశావే అని పొగిడేస్తూ అనసూయను గుండెల్లో పెట్టుకున్నాడు సగటు తెలుగు ప్రేక్షకుడు. ఆడియెన్స్ లోనే కాదు..కొంతమంది క్వాలిటేటివ్ డైరెక్టర్స్ కూడా అనసూయకు డిస్టింక్షన్ మార్కులేసి రిపీటెడ్ గా ఛాన్సులివ్వడం మొదలైంది. లేటెస్ట్ గా పుష్ప షూట్ లో జాయిన్ అయ్యారీ వెర్సటైల్ ఆర్టిస్ట్. రంగమ్మత్తగా బెటర్ మోస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి.. రంగస్థలం సినిమా సక్సెస్ ఎలిమెంట్స్ లో ఒకటిగా మారారు అనసూయ. నెక్స్ట్ మూవీ పుష్పలో అనసూయ కోసం స్పెషల్ రోల్ డిజైన్ చేశారట సుక్కూ. తెలుగుతో పాటు సౌత్ లో మిగతా మర్కెట్స్ లో కూడా చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ తెచ్చుకున్న అనసూయ.. పుష్ప రిలీజ్ తర్వాత.. పాన్ ఇండియా ఆర్టిస్ట్ అనే రికగ్నిషన్ తెచ్చుకునే ఛాన్సుంది. తనకంటూ ఒక దారి ఏర్పర్చుకుని.. కెరీర్ పరంగా ముక్కుసూటిగా వెళ్లడం అనసూయ అలవాటు. ఐటెం సాంగ్స్ అడపాదడపా చేస్తూనే.. నాట్ ఓన్లీ ఫర్ స్పెషల్ సాంగ్స్ అనేది ఆమె కండిషన్. టీవీ షోస్ తో పాటు.. పార్లల్ గా బిగ్ స్క్రీన్ అప్పియరెన్స్ క్కూడా బిగ్గర్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు సెట్స్ మీదున్న ఆచార్య, ఖిలాడీ సినిమాలతో పాటు… కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండలో కూడా నటిస్తున్నారు అనసూయ. భీష్మ పర్వంతో మలయాళ డెబ్యూ ఇస్తున్నారు. థ్యాంక్యూ బ్రదర్ పేరుతో రాబోయే యూనిక్ మూవీలో అనసూయది ఫుల్ లెన్త్ లీడ్ రోల్. నిండు చూలాలిగా నటిస్తున్నారామె.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: కోలీవుడ్ కు పూజాహెగ్డే.. బుట్టబొమ్మకు పట్టుకున్న కొత్త బెంగ.. కారణం ఇదే..

Salman Khan: సౌత్ సినిమా సాంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..