
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సతీమణి రూహి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. రాజమౌళి సినిమాలకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఐతే సినిమాతో ఇండస్ట్రీకి కెమెరామెన్ గా పరిచయమైన సెంథిల్ కుమార్ ఆతర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చినమగధీర, ఈగ, ఛత్రపతి, బాహుబలి, ఆర్ఆర్ఆర్, యమదొంగ సినిమాలకు కెమెరామెన్ గా పని చేశారు. సెంథిల్ కుమార్ సతీమణి రూహి అనారోగ్య సమస్యలతో గురువారం కన్నుమూశారు. రూహి సినీ సెలబ్రెటీలకు యోగా శిక్షణ ఇచ్చేవారు. దాంతో చాలా మంది సెలబ్రెటీలకు ఆమె సుపరిచితురాలు. రూహి మరణ వార్త విని చాలా మంది హీరోయిన్స్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలిపారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఆమె గురించి మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.
ప్రభాస్ కు రూహితో, సెంథిల్ కుమార్ తో మంచి స్నేహం ఉంది. రూహి బాహుబలి సమయంలో అనుష్కకు, ప్రభాస్ కు , రానాకు యోగా ట్రైనర్ గా పని చేశారు. తాజాగా రూహి గురించి ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఓల్డ్ వీడియోను ప్రభాస్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రభాస్ రూహి గురించి చాలా గొప్పగా చెప్పారు.
రూహి తనకు మంచి స్న్రేహితురాలు అని తెలిపారు ప్రభాస్. అలాగే ఆమె యోగా ట్రైనర్ కావడంతో ఆమె సలహాలను ఎక్కువగా పాటించే వాడిని అని తెలిపారు ప్రభాస్. షూటింగ్ లో అలసిపోయిన తర్వాత ఆమె చెప్పిన యోగా టిప్స్ బాగా పని చేసేవి.. వాటి వల్ల చాలా రిలాక్స్ అయ్యేవాడిని అని తెలిపారు. తన సలహాలు బాహుబలి 2లో చాలా హెల్ప్ అయ్యాయని ఈ వీడియోలో తెలిపారు ప్రభాస్. రూహి గురువారం రోజున హైదరాబాద్‌లోన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Yoga exponent #Roohi has passed away due to health issues. May her soul rest in peace! Stay strong, anna @DOPSenthilKumar.
Throwback video of #Prabhas talking about #SenthilKumar‘s wife, #Roohi.pic.twitter.com/nJs78SUa5W
— Hail Prabhas (@HailPrabhas007) February 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.