హమ్ జహా కడా హొజాతా హై .. లైన్ వహీసే షురూ హోతా హై! అని అమితాబ్(Amitabh Bachchan)డైలాగ్ చెప్పి ఉండొచ్చు.. ‘సిర్ఫ్ మేహీ కాఫీ హూ’.. అని డైలాగ్ రూపంలో తన క్రేజ్‌ను చూపించి ఉండొచ్చు కాని ఇదంతా.. ఆన్‌స్క్రీన్ పైనే..! వెన్ ఇట్స్ కమ్స్ టూ ఆఫ్ స్క్రీన్.. అమితాబ్‌కు తాజాగా దిమ్మతిరిగే షాక్ తగిలింది. అది కూడా.. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ ముందు. ప్రజెంట్ ప్రభాస్ ప్రాజెక్ట్ k సినిమా షూట్తో ఫుల్ బిజీగా ఉన్న అమితాబ్.. ఆ షూట్లో భాగంగానే తాజాగా అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ స్టూడియోస్‌కు వెళ్లారట. అయితే అక్కడ డ్యూటీ చేసే సెక్యూరిటీ గార్డ్స్ అమితాబ్ కార్‌ను లోపలికి రానివ్వలేదట.
స్టూడియో లోపలికి రావాలంటే ఓటీపీ చెప్పాల్సిందే నని పట్టుబట్టారట. కారు లోపల ఉంది అమితాబ్ అని ఎంత చెప్పినా.. గేట్ ఓపెన్ చేయలేదట. దీంతో విసిగిపోయిన అమితాబ్.. తన కార్ విండో దింపి మరీ.. తన ఫేస్ చూపించారట. అయినా కూడా.. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ ఓటీపీ చెబితేనే లోపలికి అలో చేస్తామని.. ఇది తమ రూల్ అని వివరించారట. దీంతో చేసేదేంలేక అమితాబ్ తిరిగి వెనక్కి వెళిపోయారట. ఇప్పుడిదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.