Kavya Maran: స్టేడియంలో కావ్యా మారన్ కన్నీరుమున్నీరు.. ఓదార్చి ధైర్యం చెప్పిన అమితాబ్

|

May 27, 2024 | 3:23 PM

ఎన్నో ఆశలతో ఫైనల్ లోకి అడుగు పెట్టిన హైదరాబాద్ పరాజయం పాలు కావడంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు నిరాశకు లోనయ్యారు. ముఖ్యంగా ఎస్ ఆర్ హెట్ టీమ్ ఓనర్ కావ్యా మారన్ అయితే స్టాండ్స్ లోనే కన్నీరు మున్నీరైంది. అయినా చప్పట్లు కొట్టి జట్టు ఆటగాళ్లను అభినందించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది

Kavya Maran: స్టేడియంలో కావ్యా మారన్ కన్నీరుమున్నీరు.. ఓదార్చి ధైర్యం చెప్పిన అమితాబ్
Amitabh Bachchan, Kavya Maran
Follow us on

సుమారు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్ ముగిసింది. ఆదివారం (మే 26 న) జరిగిన ఫైనల్ మ్యాచ్ లో SRH, KKR జట్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ విజేతగా నిలిచింది. టోర్నీ ఆద్యంతం భారీ స్కోర్లతో రెచ్చిపోయిన హైదరాబాద్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత కేకేఆర్ కేవలం 10 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని సాధించింది. తద్వారా ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. కాగా ఎన్నో ఆశలతో ఫైనల్ లోకి అడుగు పెట్టిన హైదరాబాద్ పరాజయం పాలు కావడంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు నిరాశకు లోనయ్యారు. ముఖ్యంగా ఎస్ ఆర్ హెట్ టీమ్ ఓనర్ కావ్యా మారన్ అయితే స్టాండ్స్ లోనే కన్నీరు మున్నీరైంది. అయినా చప్పట్లు కొట్టి జట్టు ఆటగాళ్లను అభినందించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ ‘ కావ్యా మేడమ్ ధైర్యంగా ఉండండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కావ్య మారన్ ను ఓదార్చారు.

‘ఐపీఎల్ ఫైనల్ ముగిసింది. KKR సులభంగా గెలిచింది. SRH మంచి జట్టు. లీగ్ లో ఇతర జట్లపై చక్కటి ప్రదర్శన చేసింది. కానీ, ఫైనల్‌లో హైదరాబాద్ ప్రదర్శన నిరాశపరిచింది. మరింత బాధ కలిగించిన విషయం ఏంటంటే.. సన్‌ రైజర్స్‌ యజమానురాలు కావ్య మారన్ స్టేడియంలోనే ఏడ్చేసింది. కెమెరాల కంట పడకూడదని వెనక్కి తిరిగి తన బాధను కన్నీళ్ల రూపంలో బయటకు వదిలేసింది. ఆమెను అలా చూస్తే బాధేసింది. ఇదే ముగింపు కాదు మై డియర్‌.. అందరికీ రేపు అనేది ఒకటుంది’ అని తన బ్లాగ్ లో రాసుకొచ్చారు అమితాబ్.

ఇవి కూడా చదవండి

ఆటగాళ్లను అభినందిస్తోన్న కావ్య మారన్.. వీడియో

కాగా అమితాబ్‌ బచ్చన్‌కి క్రికెట్‌ అంటే ప్రత్యేక అభిమానం. ఆయన తరచుగా మైదానంలో కనిపిస్తుంటారు. సమయం దొరికినప్పుడు ఇంట్లో క్రికెట్ చూస్తుంటారు. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించారు. హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓడిపోవడం పట్ల అమితాబ్ బాధపడ్డాడు. ఇదే విషయయై తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు బిగ్ బీ. ఇక ఫైనల్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ భారీ స్కోర్ చేయాలని కోరుకుంటారు. SRH కూడా ఇదే అంచనాలతో రంగంలోకి దిగింది. అయితే, కీలక ఆటగాళ్లు ఫ్లాప్ అయ్యారు. దీంతో SRH జట్టు 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత 114 పరుగుల లక్ష్యాన్ని SRH కేవలం 10 ఓవర్లలో ఛేదించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.