
మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇంద్ర. 2002 జూలై 22న విడుదలైన ఈసినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలోని డైలాగ్స్, చిరు మ్యానరిజమ్, మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో చిరు జోడీగా సోనాలి బింద్రె, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. చిరు పుట్టినరోజు సందర్భంగా (ఆగస్ట్ 22న) ఈ సినిమాను రీరిలీజ్ చేశారు మేకర్స్. ఉదయం నుంచే థియేటర్లలో మెగా అభిమానులు అరుపులు, కేకలతో రచ్చ చేస్తున్నారు. ఒకప్పటి ఇంద్ర సూపర్ హిట్ మ్యాజిక్ ను మరోసారి ఎక్స్ పీరియన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంద్ర రీరిలీజ్ కు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంద్ర సినిమా షూటింగ్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఇంద్ర సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్. ఇప్పటికీ ఈ సినిమాలోని వీణ స్టెప్ ఎవర్ గ్రీన్. అయితే ఈ మూవీలోని అమ్మడు బుచ్చి పాటకు మెగాస్టార్ స్టెప్పుల గురించి చెప్పక్కర్లేదు. ఈ పాటకు రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. సాంగ్ షూటింగ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో చిరంజీవి కుర్చొని ఉండగా.. ఓ కుర్రాడు వెనకాలే నిల్చున్నాడు. అతడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. అతడి యాక్టింగ్, స్టైల్ కు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ఇంకెవరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంద్ర షూటింగ్ సెట్ లో సందడి చేశాడు చరణ్.
ఆ వీడియోలో టీనేజ్ రామ్ చరణ్ ను చూడొచ్చు. చరణ్ తోపాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కనిపిస్తున్నాడు. వరుణ్ తేజ్ ఎంతో ఛబ్బీగా ఉన్నాడు. రామ్ చరణ్ , వరుణ్ తేజ్ స్కూల్ హాలీడేస్ సమయంలో చిరుతో కలిసి షూటింగ్ సెట్ల్ లో సందడి చేసేవారు. ప్రస్తుతం వీరిద్దరు స్టార్ హీరోలుగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
ఎన్ని రోజులు ఎక్కడ దాచారు ఈ video Ni లారెన్స్,Boss Dance….The energy vibe making of #AmmaduAppachi song 😍😍#Indra4KRerelease pic.twitter.com/nfZnAMtpTh
— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) August 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.