Allu Sirish: అను ఇమ్మాన్యుయేల్‌తో ప్రేమాయణం పై స్పందించిన శిరీష్.. ఏమన్నారంటే
గౌరవం అనే సినిమాతో శిరీష్ హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతో నటన పరంగా ఆకట్టుకున్నాడు శిరీష్.. కానీ గౌరవం సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
అల్లు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాయిస్తున్న విషయం తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గౌరవం అనే సినిమాతో శిరీష్ హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతో నటన పరంగా ఆకట్టుకున్నాడు శిరీష్.. కానీ గౌరవం సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు ఈ యంగ్ హీరో కానీ అవేమి ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. అయితే శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. చివరగా ఏబీసీడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శిరీష్. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. మొన్నటివరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకున్న శిరీష్.. ఈ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సరికొత్త ప్రేమకథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు శిరీష్. ఈ సినిమాకు ఉర్వశివో రాక్షసీవో అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ రొమాంటిక్ సన్నివేశాలతో కట్ చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి శిరీష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అను ఇమ్మాన్యుయేల్ తో ప్రేమలో ఉన్నాడన్న వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తల పై స్పందించాడు శిరీష్.
ఊర్వశివో రాక్షసివో’ ప్రమోషన్స్ లో శిరీష్ మాట్లాడుతూ… సినిమావాళ్ళ పై ఇలాంటి వార్తలు రావడం సహజమేనని అన్నాడు. గతంలో కూడా తనపై ఇలాంటి వార్తలు వచ్చాయని… అనుకు, తనకు మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, తాము మంచి స్నేహితులమని చెప్పాడు. సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చూస్తే చాలా నెగెటివిటీ ఫీలవుతామని… అందుకే తాను రెండేళ్ల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని తెలిపాడు. ఇక ఈ సినిమా కోసం అను ఇమ్మాన్యుయేల్ తో కలిసి కొన్ని నెలల పాటు పని చేశానని.. ఇద్దరి మధ్య మంచి అనుబంధం నెలకొందని శిరీష్ తెలిపాడు. తమ ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకే మాదిరి ఉన్నాయని చెప్పుకొచ్చాడు శిరీష్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.