Allu Arjun: మ‌రో ప్ర‌యోగం చేయ‌నున్న అల్లు అర్జున్‌.. త‌న‌లోని కొత్త కోణాన్ని చూపించ‌నున్న‌ ఐకాన్ స్టార్‌.?

Allu Arjun: పేరుకు న‌ట వార‌స‌త్వం ఉన్నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో అల్లుఅర్జున్‌. అన‌తి కాలంలలోనే అగ్ర హీరోల జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు బ‌న్నీ. సినిమా సినిమాకు త‌న‌లోని న‌ట‌న‌తో పాటు త‌న మేకోవ‌ర్‌ను మార్చుకుంటూ...

Allu Arjun: మ‌రో ప్ర‌యోగం చేయ‌నున్న అల్లు అర్జున్‌.. త‌న‌లోని కొత్త కోణాన్ని చూపించ‌నున్న‌ ఐకాన్ స్టార్‌.?
Allu Arjun New Role

Updated on: Jun 25, 2021 | 5:59 PM

Allu Arjun: పేరుకు న‌ట వార‌స‌త్వం ఉన్నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో అల్లుఅర్జున్‌. అన‌తి కాలంలలోనే అగ్ర హీరోల జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు బ‌న్నీ. సినిమా సినిమాకు త‌న‌లోని న‌ట‌న‌తో పాటు త‌న మేకోవ‌ర్‌ను మార్చుకుంటూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు అల్లు అర్జున్. ఈ క్ర‌మంలోనే తాజాగా పుష్ప సినిమాలో త‌న‌లోని మాస్ కోణాన్ని చూపించారు బ‌న్నీ.
ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో తొలిసారి బ‌న్నీ పూర్తిగా మాస్ లుక్‌లో.. లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇదిలా ఉంటే బ‌న్నీ త‌న త‌ర్వాతి చిత్రంతో మ‌రో విభిన్న ప్ర‌యోగం చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అల్లు అర్జున్ త‌న త‌ర్వాతి చిత్రాన్ని అర్జున్‌ వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్లాన్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ఐకాన్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను ‘కనుబడుట లేదు’ అనే ట్యాగ్ లైన్‌తో తెర‌కెక్కిస్తున్నారు. దీనికి త‌గిన‌ట్లే బ‌న్నీ ఇందులో అంధుడిగా న‌టించ‌నున్న‌ట్లు ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గ‌త కొన్ని రోజులుగా ఈ వార్త తెగ వైర‌ల్‌గా మారింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: Rashmika Mandanna: చూస్తుండ‌గానే స్టార్ స్టేట‌స్.. అంత‌లోనే నేష‌న‌ల్ క్ర‌ష్.. తాజాగా…

Ram Charan: రామ్ చరణ్ కోసం 231 కి.మీ నడిచి వచ్చిన ఫ్యాన్స్.. వారిని హ‌త్తుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్

Aha: మూవీ లవర్స్‌కి ‘ఆహా’ సర్‌ప్రైజ్.. వీకెండ్ కానుక‌గా రెండు ఫీచర్ ఫిలిమ్స్ స్ట్రీమింగ్