Allu Arjun Take A Break From Pushpa: సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి తగినంత సమయం కేటాయించే హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. కాస్త సమయం దొరికినా సరే కుటుంబ సభ్యులతో జాలీగా గడిపుతాడు బన్నీ.
ఇక గతకొన్ని రోజులుగా ‘పుష్ఫ’ చిత్రంతో చాలా బీజీగా ఉన్నాడు అల్లు అర్జున్. చివరికి సంక్రాంతికి కూడా సుకుమార్ సెలవు ఇవ్వకపోవడంతో ఇంటికి దూరంగానే ఉన్నాడు బన్నీ. అయితే తాజాగా ‘పుష్ఫ’ చిత్రం షెడ్యుల్‌ను పూర్తి చేసుకుంది. మారేడు పల్లి అడవుల్లో ఏకధాటిగా జరిగిన షెడ్యుల్ పూర్తయింది. ఇక తర్వాత షెడ్యుల్‌ను హైదరాబాద్‌లో మొదలు పెట్టడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ గ్యాప్‌లో చిత్ర యూనిట్ చిన్న బ్రేక్ తీసుకుంది. దీంతో సుమారు 3 నెలల తర్వాత దొరికిన ఈ బ్రేక్ సమయాన్ని బన్నీ కుటుంబసభ్యులతో గడపడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే భార్య స్నేహా రెడ్డి, పిల్లలు ఆయాన్, అర్హాలతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లారని తెలుస్తోంది. ఈ హాలీడే పూర్తి చేసుకొని మళ్లీ హైదరాబాద్‌లో జరగనున్న ‘పుష్ఫ’ షూటింగ్‌లో బన్నీ పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఎప్పుడూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునే బన్నీ ఈ సినిమాలో తొలిసారి మాక్ లుక్‌లో నటిస్తుండడం విశేషం.
Also Read: Kajal Agarwal: తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!