Drushyam-2: తెలుగులో ‘దృశ్యం’ చూపిస్తారా..? వెంకీ మళ్లీ రాంబాబుగా కనిపిస్తాడా.? మర్డర్ మిస్టరీ తెలిసిపోతుందా..?

Venkatesh Will act In Drushyam-2: మలయాళంలో వచ్చిన 'దృశ్యం' సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషంగా సాగుతోన్న ఓ మధ్య తరగతి కుటుంబంలో..

Drushyam-2: తెలుగులో 'దృశ్యం' చూపిస్తారా..? వెంకీ మళ్లీ రాంబాబుగా కనిపిస్తాడా.? మర్డర్ మిస్టరీ తెలిసిపోతుందా..?
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 09, 2021 | 7:14 PM

Venkatesh Will act In Drushyam-2: మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషంగా సాగుతోన్న ఓ మధ్య తరగతి కుటుంబంలో అనుకోకుండా చోటుచేసుకున్న సంఘటన వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు కురిపించింది. ఇక తెలుగులోనూ రీమేక్‌ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఇందులో రాంబాబు పాత్రలో విక్టరీ వెంకటేష్‌ అద్భుత నటనను కనబరిచాడు. హిందీలోనూ విడుదలైన ఈ సినిమా అక్కడా హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా మలయాళంలో ‘దృశ్యం-2’ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే చిత్ర యూనిట్‌ ఈ సినిమాను ఈనెల 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దృశ్యంలో మిస్టరీగా మిగిలిపోయిన మర్డర్‌ కేసు మళ్లీ తెరపైకి వస్తే ఏం జరిగిందన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగులోనూ ఈ సినిమా సీక్వెల్‌ తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా వెంకీ మరోసారి రాంబాబు పాత్రలో ఆకట్టుకోనున్నాడని సమాచారం. మరికొన్ని రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని చర్చ జరుగుతోంది. ఇక వెంకీ ప్రస్తుతం.. ‘ఎఫ్‌3’ సినిమాతో పాటు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

Also Read: Rashmika Mandanna : అభిమాన హీరో సరసన ఆఫర్ అందుకున్న టాలీవుడ్ లక్కీ బ్యూటీ.. ఇంతకు అతడెవరంటే..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!