Allu Arjun Police Inquiry Highlights: ముగిసిన అల్లు అర్జున్ విచారణ..

| Edited By: Basha Shek

Dec 24, 2024 | 3:58 PM

Allu Arjun Stampede case Highlights : అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. సంద్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు పోలీసులు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంద్యథియేటర్ కు సినిమా చేసేందు వెళ్లారు అల్లు అర్జున్. ఆ సమయంలో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున అక్కడికి వచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది. దానిలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు గాయపడ్డాడు.

Allu Arjun Police Inquiry Highlights: ముగిసిన అల్లు అర్జున్ విచారణ..
Allu Arjun

అల్లు అర్జున్ పోలీసులు ముందు హాజరయ్యారు. నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు పంపారు పోలీసులు. సంద్యథియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసిన చేశారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ సందడి చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దాంతో అల్లు అర్జున్ బౌన్సర్లు జనాలను వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను ఏ 11గా చేర్చారు.

తాజాగా అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ  విచారణలో పోలీసులు సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటన గురించి అల్లు అర్జున్ ను ప్రశ్నించనున్నారు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా స్టేషన్ కు వచ్చారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు పోలీసులు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Dec 2024 02:50 PM (IST)

    అల్లు అర్జున్ విచారణ పూర్తి..

    సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. మరి పోలీసుల విచారణ గురించి అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతారో లేదో చూడాలి.

     

  • 24 Dec 2024 02:29 PM (IST)

    సంధ్య థియేటరలో మరొకరు అరెస్ట్

    సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని రెండు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

  • 24 Dec 2024 01:58 PM (IST)

    2 గంటలకు పైగా జరుగుతోన్న విచారణ

    చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో  అల్లు అర్జున్‌ విచారణ కొనసాగుతోంది.  సుమారు రెండు గంటలకుపైగా ఈ విచారణ కొనసాగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట గురించి అల్లు అర్జున్ నుంచి పలు వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

  • 24 Dec 2024 12:49 PM (IST)

    సంద్య థియేటర్ దగ్గర భారీగా పోలీసులు

    సంద్యథియేటర్ దగ్గర భారీగా పోలీసులు చేరుకున్నారు. కాసేపట్లో అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ కు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది.

  • 24 Dec 2024 12:34 PM (IST)

    అల్లు అర్జున్ ను విచారిస్తున్న సెంట్రల్ జోన్ డీసీపీ

    సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేష్ అలాగే సీఐ రాజు నాయక్ అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు. మరి అల్లు అర్జున్ చెప్పే సమాధానాలకు పోలీసులు సంతృప్తి చెందుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

  • 24 Dec 2024 12:09 PM (IST)

    ప్రెస్ మీట్ రూల్స్‌కు విరుద్ధం అంటున్న పోలీసులు

    అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ పై వచ్చిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం రూల్స్ కు విరుద్ధం అంటున్నారు పోలీసులు. దీని పై అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది.

  • 24 Dec 2024 12:02 PM (IST)

    రోడ్ షో పై కూడా ప్రశ్నలు అడుగుతున్నారు పోలీసులు

    అల్లు అర్జున్ రోడ్డు షో చేశారన్నదని పై కూడా ప్రశ్నలు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో రోడ్డు షో చేయలేదు అని చెప్పుకొచ్చారు పోలీసులు.

  • 24 Dec 2024 12:00 PM (IST)

    సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌, స్టేట్‌మెంట్స్‌పై ప్రశ్నలు

    ఇప్పటికే 20ప్రశ్నలు సిద్ధం చేశారు పోలీసులు.  అడ్వొకేట్‌ సమక్షంలోనే అల్లు అర్జున్‌ విచారణ జరుగుతుంది.

  • 24 Dec 2024 11:58 AM (IST)

    బౌన్సర్ల గురించి కూడా ప్రశ్నలుకురిపించనున్న పోలీసులు..

    అల్లు అర్జున్ బౌన్సర్ల గురించి కూడా ప్రశ్నలు అడగనున్నారు పోలీసులు. అభిమానులపై బౌన్సర్లు దాడి గురించి ప్రశ్నించనున్నారు పోలీసులు

  • 24 Dec 2024 11:53 AM (IST)

    అల్లు అర్జున్ ను సంద్య థియేటర్‌కు తీసుకెళ్లే అవకాశం..

    అల్లు అర్జున్ పై ప్రశ్నలు కురిపిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే తొక్కిసలాట సమయంలో జరిగిన విషయాలను అడుగుతున్నారు పోలీసులు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ తర్వాత సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ ను తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.

  • 24 Dec 2024 11:48 AM (IST)

    అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై ప్రశ్నలు..

    అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన పై స్పందించిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దాని పై కూడా పోలీసులు ప్రశ్నలు అడుగుతున్నారు పోలీసులు.

  • 24 Dec 2024 11:39 AM (IST)

    పోలీసులు సంధిస్తున్న ప్రశ్నలు ఇవే ..

    – థియేటర్‌కి వస్తున్నట్టు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు..?

    – రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా?

    – పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరూ చెప్పలేదా?

    – మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?

    – రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్లోనే ఉన్నపుడు తెలియదా?

    – ఏసీపీ, సీఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా?

    – మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది? ఎక్కడి నుంచి వచ్చారు?

    – అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు ఏంటి?

    – ప్రెస్‌మీట్‌లో మీరు చెప్పిన విషయాలపై వివరణ ఏంటి?

    – ఓ మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది?

    – మీరు 2:45 గంటలు థియేటర్‌లో ఉన్నది వాస్తవం కాదా?

    – 850 మీటర్లు ఎందుకు రోడ్‌షో చేశారు?

    – వెళ్లేటప్పుడు మళ్లీ అభివాదం ఎందుకు చేయాల్సి వచ్చింది..?

  • 24 Dec 2024 11:39 AM (IST)

    అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు..

    అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు పోలీసులు. అసలు సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటనను వివరంగా తెలుసుకుంటున్న పోలీసులు..

Follow us on