Allu Arjun: ‘జస్ట్ మైండ్ బ్లోయింగ్.. మళ్లీ గర్వపడేలా చేశారు’.. ‘యానిమల్’ సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ..

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించగా.. సీనియర్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్లు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అడియన్స్ ఊహించని స్థాయిలో దూసుకుపోతుంది. ముఖ్యంగా రణబీర్ నటన, సందీప్ మేకింగ్ అదిరిపోయిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

Allu Arjun: జస్ట్ మైండ్ బ్లోయింగ్.. మళ్లీ గర్వపడేలా చేశారు.. యానిమల్ సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ..
Allu Arjun

Updated on: Dec 08, 2023 | 4:30 PM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోంది ‘యానిమల్’ సినిమా. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి అడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించగా.. సీనియర్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్లు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అడియన్స్ ఊహించని స్థాయిలో దూసుకుపోతుంది. ముఖ్యంగా రణబీర్ నటన, సందీప్ మేకింగ్ అదిరిపోయిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, హీరోయిన్ త్రిష ఈ మూవీపై రియాక్ట్ కాగా.. తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ యానిమల్ మూవీ మైండ్ బ్లోయింగ్ అని..సందీప్ మరోసారి మమ్మల్ని గర్వపడేలా చేశారని అన్నారు.

“యానిమల్ సినిమా అదిరిపోయింది. సినిమాటిక్ బ్రిలియన్స్ కనిపించింది. యానిమల్ చిత్రయూనిట్ కు అభినందనలు. ఇండియన్ సినిమా పర్ఫార్మెన్స్ ను రణబీర్ కొత్త లెవల్ కు తీసుకెళ్లాడు. నువ్వు నీ పర్ఫార్మెన్స్ తో క్రియేట్ చేసిన మ్యాజిక్ గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. మీ మీద రెస్పెక్ట్ మరింత పెరిగింది. ఇక రష్మిక నువ్వు అదరగొట్టేసావు. ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇలాంటివి ఇంకా రావాలి. అలాగే బాబీ డియాల్..మీ నటన మాకు మాటలు లేకుండా చేసింది. అనిల్ కపూర్ గారి అనుభవమే మాట్లాడింది. యంగ్ లేడీ త్రిప్తి దిమ్రి చాలా మంది హార్ట్ బ్రేక్ చేసింది. ఇంకా చేయాలి. అలాగే మిగిలిన ఆర్టిస్టులకు.. టెక్నిషియన్స్ అందరికి అభినందనలు. ” అంటూ రాసుకొచ్చారు.

అలాగే డైకెక్టర్ సందీప్ గురించి ప్రస్తావిస్తూ.. “సందీప్.. మీరు సినిమాల్లో ఉన్న లిమిటేషన్స్ దాటేశారు. సినిమాలో ఉన్న ఇంటెన్స్ దేనితోనూ పోల్చలేం. మీరు మా అందర్నీ గర్వపడేలా చేశారు. మీ సినిమాకు ఇండియన్ సినిమాను ఇప్పుడు.. భవిష్యత్తులో ఎలా మారుస్తాయా నేను కచ్చితంగా చూస్తాను.. ఈ సినిమా ఇండియన్ క్లాసిక్ సినిమాలో జాబితాలో చేరిపోయింది ” అంటూ యానిమల్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించాడు బన్నీ.ప్రస్తుతం అతడు చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే..పుష్ప 2 తర్వాత బన్నీ డైరెక్టర్ సందీప్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.