Allu Arjun: షాకిస్తున్న బన్నీ రెమ్యునరేషన్.. పుష్ప 2 కోసం భారీగా పారితోషకం అందుకోనున్న ఐకాన్ స్టార్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాకోసం అభిమానులంతా అంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Allu Arjun: షాకిస్తున్న బన్నీ రెమ్యునరేషన్.. పుష్ప 2 కోసం భారీగా పారితోషకం అందుకోనున్న ఐకాన్ స్టార్..?

Updated on: Jun 03, 2021 | 6:59 AM

pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాకోసం అభిమానులంతా అంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్పాలో బన్నీ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఎర్ర చందనం స్మగ్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న పుష్ప మూవీలో లారీ డ్రైవర్ గా నటిస్తున్నారు అల్లు అర్జున్. గిరిజన యువతి పాత్రలో కనిపిస్తారు స్టార్ హీరోయిన్ రష్మిక. ఆగస్టు 13న రిలీజ్ డేట్ అనుకున్నా.. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనన్న క్లారిటీకొచ్చేశారు మేకర్స్. సేమ్ టైం… సినిమా కంటెంట్ విషయంలో కూడా మేజర్ డెసిషన్ తీసుకున్నారట‌. పుష్ప1 అండ్ పుష్ప2.. ఇలా సినిమాను రెండు భాగాలుగా విడగొట్టాలన్నది సుక్కూ వేసిన న్యూ ఐడియా అని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. ఇప్పటివరకు 70 పర్సెంట్ షూటింగ్ ముగిసిందని… ఆ రషెస్ తో ఫస్ట్ పార్ట్ ని కంక్లూడ్ చేసి ఆక్టోబర్ 13న రిలీజ్ చేయాలన్నది తాజా ప్లాన్ అట‌. మిగతా పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేసేలా స్కెచ్ రెడీ చేశారని టాక్‌. ఇప్పటికే ఈ మూవీలో రెండు గెటప్స్ తో కనిపిస్తున్నారు ఐకాన్ స్టార్.

డబుల్ యాక్షన్ చేస్తున్నట్లు ఎక్కడా కన్ఫర్మ్ చేయకపోయినా.. స్టోరీ లైన్ ని రెండు జెనరేషన్లకు మార్చి తియ్యబోతున్నారట లెక్కల మాస్టారు. పుష్ప మొదటి పార్ట్ కు బన్నీ తీసుకున్న పారితోషికం తో పోల్చితే రెండవ పార్ట్ పారితోషికం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అల వైకుంఠపురంలో మూవీకి ఎంత పారితోషికం అయితే తీసుకున్నాడో పుష్ప మొదటి పార్ట్ కు అంతే పారితోషికం తీసుకుంటున్నాడు. కాని పుష్ప 2 కు మాత్రం పారితోషికం కాస్త ఎక్కువగానే తీసుకోనున్నాడట బన్నీ. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna : ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ పైన గుర్రుగా ఉన్న బాలయ్య అభిమానులు.. కారణం ఇదే..

కరోనా కష్టకాలంలో కాస్ట్లీ ఇళ్లు కొనుగోలు చేస్తున్న బాలీవుడ్ స్టార్స్.. అమితాబ్ పాటు ఆ హీరో కూడా…