Jr.NTR-Allu Arjun: హ్యాపీ బర్త్​డే బావ.. ఎన్టీఆర్‏కు అల్లు అర్జున్ విషెస్.. ఫ్యాన్స్ ఖుషీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్టీఆర్‏కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. "హ్యాపీ బర్త్ డే బావ.. హాప్ యు హ్యావ్ ఎ బ్లడీ గుడ్ బర్త్ డే" అంటూ ట్వీట్ చేసారు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. అటు తారక్ ఫ్యాన్స్.. ఇటు బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jr.NTR-Allu Arjun: హ్యాపీ బర్త్​డే బావ.. ఎన్టీఆర్‏కు అల్లు అర్జున్ విషెస్.. ఫ్యాన్స్ ఖుషీ..
Allu Arjun, Jr.ntr

Updated on: May 20, 2023 | 5:20 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తారక్‏కు ఫ్యాన్స్, సినీ ప్రముఖులు, స్టార్స్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్టీఆర్‏కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే బావ.. హాప్ యు హ్యావ్ ఎ బ్లడీ గుడ్ బర్త్ డే” అంటూ ట్వీట్ చేసారు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. అటు తారక్ ఫ్యాన్స్.. ఇటు బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తారక్, బన్నీ మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. గతంలో అల్లు అర్జన్ బర్త్ డే సమయంలో బన్నీకి విషెస్ చెబుతూ.. బావ అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్.. దానికి బన్నీ ఇచ్చిన రిప్లై నెట్టింట రోజంతా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగబోతుందనేది చూడాలి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమ చేస్తున్నారు ఎన్టీఆర్. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా పై ఇప్పటికే భారీగా హైప్ నెలకొంది. ఇందులో రష్మిక, ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. ఇటీవల ఈ మూవీ సెట్ లో సందడి చేశారు తారక్. దేవర, పుష్ప 2 చిత్రీకరణ ఒకే ప్రాంతంలో జరుగుతుండడంతో పుష్ప 2 సెట్ లో అడుగుపెట్టారు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.