
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈమూవీని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోండగా.. నేషనల్ క్రష్ రష్మిక, మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటిస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సుకుమార్.. ఇప్పుడు సెకండ్ పార్ట్‌తో మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పుష్ప 2 ఏరేంజ్‌లో ఉండబోతుందో తెలియజేశారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇక పుష్ప భారీ విజయాన్ని సాధించడంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో బన్నీ అచి తుచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో ఛాన్స్ వచ్చినప్పటికీ బన్నీ రిజెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉరి.. ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ ఆదిత్య ధర్. 2019లో విడుదలైన ఈ మూవీకి విశేష స్పందన వచ్చింది. ఈ సినిమాతో చిత్రపరిశ్రమలో ఆయనకు క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తోన్న అమర్ అశ్వథ్థామ సినిమాపై ఆసక్తి నెలకొంది. ముందుగా ఈ మూవీ ఆఫర్ ముందుగా బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ వద్దకు రాగా.. కొన్ని కారణాలతో అతను రిజెక్ట్ చేశారట. ఇక ఆ తర్వాత ఈ సినిమా ఛాన్స్ రణ్వీర్ సింగ్ వద్దకు వెళ్లింది. ఇక అతను కూడా ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో చివరకు ఆ ఛాన్స్ బన్నీకి చేరింది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో బన్నీ ఆసక్తి చూపించినప్పటికీ పాత్ర పోషించేందుకు మాత్రం సంకోచించాడట. ఈ సినిమాకు తన నిర్ణయాన్ని చెప్పేందుకు కాస్త సమయం కావాలని కోరాడట. కానీ చివరకు ఈ సినిమా చేసేందుకు బన్నీ నిరాకరించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఇందులో ఫుల్ మాస్ అవతారంలో కనిపించిన బన్నీని.. వెంటనే అశ్వథ్థామ అనే ఇతిహాసం కథతో తన పాత్రను తెరపై ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా అని ఆలోచించారట. అలాగే ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ ఆధారంగానే ఎక్కువగా సీన్స్ తెరకెక్కించనున్నారని.. ఇది తన కెరీర్ లోనే పెద్ద ఛాలెంజ్ అవుతందని భావించారట బన్నీ. ఇక అదే రీజన్ తో అశ్వథ్థామ సినిమాను వదులుకున్నారని సమాచారం.
ప్రస్తుతం బన్నీ నటిస్తోన్న పుష్ప 2 చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు టైటిల్ ఫిక్స్ చేయలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.