పుష్ప 2 రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాదు నార్త్ లోనూ అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హిందీ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన అల్లు అర్జున్, 2021లో విడుదలైన ‘పుష్ప 1: ది రైజ్’తో డైరెక్టర్ గా నార్త్ ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు. పుష్ప2 సినిమా విడుదలైన తొలిరోజే భారీ వసూళ్లు రాబట్టింది. హిందీలో అల్లు అర్జున్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేశాడు. పుష్ప2 చిత్రం గురువారం భారీ స్క్రీన్‌లపైకి వచ్చింది. బీహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి నగరాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
ట్రేడ్ రిపోర్ట్స్ ప్రాథమిక అంచనాల ప్రకారం, ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ మొదటి రోజు 66 కోట్ల నుంచి 68 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. ఫైనల్ ఫిగర్స్ బయటకు వస్తే ఈ సినిమా హిందీ కలెక్షన్స్ 70 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సినిమా గురించే చర్చ జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ రికార్డ్ ను పుష్ప రాజ్ బద్దలు కొట్టాడు. గత ఏడాది విడుదలైన షారుఖ్ ఖాన్ బ్లాక్‌బస్టర్ ‘జవాన్’ హిందీలో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్‌గా రికార్డు సృష్టించింది.
కింగ్ ఖాన్ చిత్రం ‘జవాన్’ 65.5 కోట్లు వసూలు చేసింది. అయితే ‘పుష్ప 2’ వసూళ్లతో షారూఖ్ రికార్డును అల్లు అర్జున్ బ్రేక్ చేశాడు. నివేదికల ప్రకారం బాలీవుడ్లో 2017 చిత్రం ‘బాహుబలి’ మొదటి రోజు 41 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2022లో విడుదలైన ‘కేజీఎఫ్ 2’ చిత్రం రూ.54 కోట్లు రాబట్టింది. ఇప్పుడు పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తొలి రోజే దాదాపు రూ.70కోట్ల వరకు రాబట్టి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. జవాన్ రూ.65కోట్ల వరకే రాబట్టింది. మరి రానున్న రోజుల్లో ‘పుష్ప 2’ సినిమా ఎన్ని కోట్ల రూపాయలను దాటుతుందో చూడాలి.
‘PUSHPA 2’ EYES TWO MAJOR RECORDS ON *DAY 1*: ‘JAWAN’ – ‘ANIMAL’…
⭐️ #Jawan: ₹ 65.50 cr
Highest *opening day* EVER… Can #Pushpa2 #Hindi claim the throne as the biggest opener of all time?
⭐️ #Animal: ₹ 54.75 cr
Highest *non-holiday* *opening day*… Will #Pushpa2 #Hindi set… pic.twitter.com/jm7B0RqCrq— taran adarsh (@taran_adarsh) December 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.