
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. భక్తిశ్రద్ధలతో గణనాథుడికి పూజలు అందిస్తున్నారు. ఇక వీధుల్లో వివిధ రూపాల్లో గణపయ్యలు కొలువు దీరారు. ఇటీవల కాలంలో సినిమా హీరోల రూపంలో కూడా వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఒక వినాయకుడి విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనే పుష్ప స్టైల్ లో వినాయకుడి విగ్రహాలు కొలువు దీరాయి. అయితే ఇప్పుడీ దీనికి నెక్ట్స్ లెవెల్ అనిపించేలా ఏకంగా వినాయక మండపాన్ని కూడా పుష్ప 2 సెట్ లానే తీర్చిదిద్దారు. అలాగే అల్లు అర్జున్ గెటప్ లో వినాయకుడు విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వినాయకుడి మండపం చూస్తుంటే మాత్రం అచ్చం ఎర్రచందనంతోనే మండపాన్ని అలంకరించారా? అనే విధంగా ఏర్పాట్లు చేశారు. వీడియోను చూస్తే ముందుగా ఎంట్రన్స్ లో హెలికాప్టర్ వద్ద గన్ తో నిల్చున్న పుష్ప రాజ్ ను ప్రతిష్ఠించారు. ఇక ఎర్రచందనం దుంగల సెటప్ నుంచి లోపలికి వెళితే గంగమ్మ జాతరలో గెటప్, అలాగే రప్పా రప్పా ఫైట్ కాస్ట్యూమ్స్ లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలాగే మండపంలో చాలా చోట్ల అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు సంబంధించిన స్టిల్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ వినాయకుడి మండపం చూస్తుంటే అచ్చం సినిమా సెట్టును తలపిస్తుందని చెప్పాలి.
తమిళనాడులోని హోసూరులో ఇలా సినిమా సెట్టు తరహాలో ఈ వినాయక విగ్రహాన్ని ఏర్పటు చేశారు. ఈ సెటప్ కోసం దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అల్లు అర్జున్ అభిమానులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.
Mee abhimanam salla gunda ❤️🙏
Pushpa2 style setup for Ganesh mandap 🔥
Tamilnadu hosur 📍@alluarjun #AA22 #GaneshChaturthi pic.twitter.com/Ve2HwVZHfE— TotallyAlluArjun (@TeamTAFC) August 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.