ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప 2 మేనియా కనిపిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాపై భారీ హైప్ నెలకొంది. గతంలో పుష్ప ది రైజ్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన పుష్పరాజ్.. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియాను ఏలేందుకు రెడీ అయ్యాడు. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జోడి మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. డిసెంబర్ 5న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇక మరోవైపు ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఇటీవలే కొద్ది రోజుల క్రితం పీలింగ్స్ అనే సరికొత్త సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే ఆ సాంగ్ ప్రోమో మలయాళంలో ఉండడంతో ప్రేక్షకులలో ఆ పాట మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇక తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో మొదట లిరిక్స్ మలయాళంలో ఉండగా.. ఆ తర్వాత తెలుగులోనే సాంగ్ కంటిన్యూ అయ్యింది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మాస్ మ్యూజిక్ అదిరిపోయింది.
అలాగే చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీ దాస ఆలపించారు. ఈ పాటలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా వేసిన మాస్ స్టెప్స్ అదిరిపోయాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలకపాత్రలు పోషించారు. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.