AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arha: క్రిస్మస్ కేక్ రెడీ చేసిన అల్లు అయాన్, అర్హ.. కిచెన్‏లో తల్లితో కలిసి బన్నీ పిల్లల అల్లరి.. వీడియో వైరల్..

మెగా, అల్లు ఫ్యామిలీస్ కలిసి క్రిస్మస్ పార్టీ ఏర్పాటు చేయగా.. ఇందులో మెగా కజిన్స్ అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ముఖ్యంగా ఎప్పుడో ఒకసారి కనిపించే అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ పార్టీలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే ఇప్పుడు ఓ స్పెషల్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అది మరెవరిదో కాదు.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ, కుమారుడు అల్లు అయాన్ వీడియో.

Allu Arha: క్రిస్మస్ కేక్ రెడీ చేసిన అల్లు అయాన్, అర్హ.. కిచెన్‏లో తల్లితో కలిసి బన్నీ పిల్లల అల్లరి.. వీడియో వైరల్..
Allu Ayaan, Arha
Rajitha Chanti
|

Updated on: Dec 27, 2023 | 6:45 AM

Share

ప్రపంచవ్యా్ప్తంగా క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గ్రాండ్‏గా జరిగాయి. సామాన్యుల నుంచి స్టార్స్ వరకు ఫ్యామిలీతో కలిసి పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సినీతారలు క్రిస్మస్ పండగను ఓ వేడుకల జరుపుకున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీస్ కలిసి క్రిస్మస్ పార్టీ ఏర్పాటు చేయగా.. ఇందులో మెగా కజిన్స్ అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ముఖ్యంగా ఎప్పుడో ఒకసారి కనిపించే అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ పార్టీలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే ఇప్పుడు ఓ స్పెషల్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అది మరెవరిదో కాదు.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ, కుమారుడు అల్లు అయాన్ వీడియో. వీరిద్దరూ తమ తల్లితో కలిసి కిచెన్‏లో సందడి చేశారు. క్రిస్మస్ పండగ సందర్భంగా కేక్ తయారు చేశాడు అయాన్.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ చేసే అల్లరి గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరికి సంబంధించిన ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. బన్నీతో కలిసి అర్హ చేసే అల్లరి గురించి తెలిసిందే. ఇక అయాన్ ఫోటోస్, వీడియోస్ సైతం నిత్యం చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా క్రిస్మస్ సందర్భంగా వీరిద్దరూ తమ తల్లి స్నేహారెడ్డితో కలిసి కిచెన్‏లో క్రిస్మస్ కేక్ రెడీ చేశారు. చాక్లెట్ కేక్ ఎలా రెడీ చేయాలో చెబుతూ.. పిల్లల చేత కేక్ రెడీ చేయించింది స్నేహా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇందులో అయాన్ ఎక్కువగా ఇంగ్లీష్‏లోనే మాట్లాడుతుండగా..అర్హ తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ కనిపించింది.

ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా అర్హ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. సమంత నటించిన శాకుంతలం సినిమాలో భరతుడిగా కనిపించింది అర్హ. తొలి సినిమాలోనే తెలుగులో డైలాగ్స్ చెబుతూ యాక్టింగ్ అదరగొట్టేసింది. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.