Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్..

తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా ప్రారంభమైంది. శనివారం సాయంత్రం జరుగుతున్న ఈ వేడుకలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అల్లు అర్జున్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో రేవంత్ అక్కడ ఉన్నవారిని పలకరిస్తుూ బాలకృష్ణతోపాటు అల్లు అర్జున్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్..
Cm Revanth Reddy, Allu Arju

Updated on: Jun 14, 2025 | 9:42 PM

తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సం హైదరాబాద్ లోని హైటెక్స్ లో శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో జరుగుతున్న అవార్డుల కార్యక్రమం ఇది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌, అల్లు అర్జున్, సుకుమార్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, మణిరత్నం హాజరయ్యారు. పుష్ప 2 సినిమాలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డ్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డ్ అందుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. డైరెక్టర్ సుకుమార్ లేకపోతే ఇది జరిగేది కాదని అన్నారు.

“ఈ అవార్డ్ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పుష్ప 2 సినిమాకు నేను గెలిచిన మొదటి అవార్డ్ అది. ఈ అవార్డును నేను నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. మీ ప్రేమ, సపోర్ట్ కు ధన్యవాదాలు. మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు..పుష్ప 2 టీం మొత్తానికి థాంక్యూ “అని అన్నారు.

ఇవి కూడా చదవండి :  

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..

Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..