
అల్లు అర్జున్.. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. అది పుష్ప రి రైజ్ విడుదలకు ముందు మాట. ఇప్పుడు చెప్పాలంటే పాన్ ఇండియా యాక్టర్. పాన్ వరల్డ్ అని కూడా చెప్పవచ్చు. అంతలా పుష్ప సినిమా బన్నీ గ్రాఫ్‌ని పెంచింది. సిగ్నేచర్ స్టెప్పులు, పాటలు, డైలాగ్స్.. ఇలా ప్రతి ఎలిమెంట్ జనాల్లోకి వెళ్లిపోయింది. పుష్పరాజ్’పాత్రలో బన్నీ ఊర మాస్ యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రజంట్ ఐకాన్ స్టార్ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో బన్నీ మేనియా నడుస్తుంది. ప్రజంట్ ఆల్మోస్ట్ 19.9 మిలియన్ల మంది ఇన్ స్టాలో అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్నారు. మరి బన్నీ ఫాలో అయ్యేది ఎవర్నో మీకు తెలుసా.,.?
ఐకాన్ స్టార్ ఓన్లీ ఓకే ఒక పర్సన్‌ను ఫాలో అవుతున్నారు. ఆమె కూడా ఎవరో కాదు తన అర్థాంగి స్నేహ రెడ్డి. ఈ విషయాన్ని చాలామంది గుర్తించి ఉండరు. స్నేహ రెడ్డిని కూడా ఇన్ స్టాలో 8.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. చాలామంది హీరోయిన్స్ కంటే ఆమెకు ఫాలోవర్స్ ఎక్కువ. ఎప్పుడూ స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొడుతూ ఉంటారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి. ఏవైనా ఫెస్టివల్స్, ఫంక్షన్స్ ఉంటే.. ఆ వేడుకల్లో.. శారీలో మెరిస్తూ కనిపిస్తారు.
ఇక వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు ట్రెండీ డ్రస్సెస్ ధరిస్తారు. స్నేహారెడ్డి ఏ కాస్టూమ్‌లో అయినా గ్లామరస్‌గా ఉంటారని..హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోరంటూ కామెంట్స్ పెడుతుంటారు నెటిజన్స్. కాగా బన్నీ సినిమాల విషయానికి వస్తే.. సుక్కూ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప: ది రూల్ చిత్రం ప్రజంట్ షూటింగ్ జరుపుకుంటోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.