Allu Arha: తండ్రికి తగ్గ తనయ.. బదామీ సాంగ్ కు అర్హ డ్యాన్స్ వీడియో వైరల్.. మేడమ్ సార్.. మేడం అంతే అంటున్న ఫ్యాన్స్..

| Edited By: Ravi Kiran

Feb 10, 2022 | 5:12 PM

Allu Arha: టాలీవుడ్ యూత్ ఐకాన్ స్టార్, స్తైలిస్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) తెలుగు ప్రేక్షకులతో పాటు కేరళలో కూడా మంచి అభిమానులను సొంతం చేసుకున్నాడు. పుష్ప(Pushpa) సినిమాతో ఉత్తరాదిన అడుగు పెట్టి..

Allu Arha: తండ్రికి తగ్గ తనయ.. బదామీ సాంగ్ కు అర్హ డ్యాన్స్ వీడియో వైరల్.. మేడమ్ సార్.. మేడం అంతే అంటున్న ఫ్యాన్స్..
Follow us on

Allu Arha: టాలీవుడ్ యూత్ ఐకాన్ స్టార్, స్తైలిస్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) తెలుగు ప్రేక్షకులతో పాటు కేరళలో కూడా మంచి అభిమానులను సొంతం చేసుకున్నాడు. పుష్ప(Pushpa) సినిమాతో ఉత్తరాదిన అడుగు పెట్టి.. మొదటి సినిమాతోనే ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు ఈ అల్లువారబ్బాయి. దక్షిణాది హీరోల్లో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ ఓ లెవెల్ లో ఉంటుంది. తన సినిమలకు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు.. తమ ఫ్యామిలీకి సంబందించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటాడు. ఇక అల్లు అర్జున్ పిల్లలు, అయాన్, అర్హలకూడా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ అంటే చిన్న పిల్లలకు పెద్దవారికి కూడా విపరీతమైన ఇష్టం. తండ్రితో చేసే చిలిపి పనులు.. అర్హ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ తండ్రితో ఉండే అనుబందానికి అందరూ ఫిదా.

తండ్రి అల్లు అర్జున్ ని నువ్వు దోశ స్టెప్ వేశావు అని నవ్వించినా.. తండ్రికి ప్రేమతో స్వాగతం చెప్పినా.. బెండకాయ, దొండకాయ నువ్వు నా గుండె కాయ అంటూ తండ్రి అల్లు అర్జున్ మీద ఉన్న ప్రేమని వ్యక్త పరిచిన వీడియోలను ఎవరు చూసినా వెంటనే అర్హకు అభిమానులుగా మారిపోతారు. ఇక తండ్రి తనయులు చేసే సందడిని అందరూ ఇష్టపడతారు కూడా.. అర్జ తాజా ఓ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ సాంగ్ వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసిన అల్లు అర్జున్.. మై లిల్ బాదాం అర్హా అంటూ కాప్షన్ కూడా జత చేశాడు. అర్హ డ్యాన్స్ కు నెటిజన్లు కూడా ప్రశంసల వర్హం కురిపిస్తున్నారు. మేడం సార్ మేడం అంతే అంటే.. మరికొందరు.. తండ్రికి తగ్గ తనయ.. చూడముచ్చటగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు. ఎక్కడా అర్హ తగ్గేదేలే అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు..

 

Also Read: Lata Mangeshkar: ఈరోజు లతాజీ అస్థికలను నాసిక్ లోని పవిత్ర రామకుండ్‌ లో నిమజ్జనం చేసిన ఆదినాథ్ మంగేష్కర్,ఆశా భోస్లే..