Allu Arjun : బన్నీని ఈసారి బోయపాటి అలా చూపించనున్నారట.. వైరల్ అవుతున్న వార్త..

అఖండ సినిమాతో భారీ  హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బోయపాటి ఇప్పుడు ఎవరితో సినిమా చేయబోతున్నది ఆసక్తిగా మారింది.

Allu Arjun : బన్నీని ఈసారి బోయపాటి అలా చూపించనున్నారట.. వైరల్ అవుతున్న వార్త..
Bunny

Updated on: Jan 04, 2022 | 4:16 PM

Allu Arjun : అఖండ సినిమాతో భారీ  హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బోయపాటి ఇప్పుడు ఎవరితో సినిమా చేయబోతున్నది ఆసక్తిగా మారింది. బాలయ్యతో భారీ హ్యాట్రిక్ కొట్టిన బోయపాటితో సినిమా చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మెగా హీరోతో సినిమా చేయనున్నాడని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ మెగా హీరో ఎవరోకాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్ లో సరైనోడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సారి బోయపాటి బన్నీతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

బన్నీతో బోయపాటి అదిరిపోయే కథతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే బన్నీకి కథ వినిపించాడని బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో తెగ చక్కర్లు కొడుతుంది. పక్కా ఎమోషనల్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈమూవీలో బన్నీ  డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. బన్నీ ఇప్పటివరకు ద్విపాత్రాభినయం చేయలేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమాపై బన్నీ అభిమానుల్లో అంచనాలు భారీ క్రియేట్ అయ్యాయి. ఇటీవలే పుష్ప సినిమా తో భారీ విజయాన్ని అందుకున్న బన్నీ త్వరలో పార్ట్ 2 ను మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమా సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బోయపాటి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Liger Glimpse-Vijay Devarakonda: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్.. రికార్డ్స్ కొల్లగొడుతున్న రౌడీ విజయ్..

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లాంచ్ డేట్ అప్పుడేనా.. కంటెస్టెంట్లు వీరేనా.!

Viral Photo: పిస్టోల్ చేతపట్టి స్టైల్‏గా ఫోటోకు ఫోజిచ్చిన ఈ చిన్నది.. ఇటు సౌత్, అటు నార్త్‏లో దూసుకుపోతుంది..