సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు పుష్ప మేనియా కొనసాగుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్‌లో అదరగొట్టాడు బన్నీ. ఇక అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న మెప్పించింది. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రోజు రోజుకీ మరింత జోష్‌తో రికార్డ్స్ కలెక్షన్స్ కురిపిస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప చిత్రయూనిట్ వరుసగా ప్రాంతాలవారీగా సక్సెస్ పార్టీ నిర్వహిస్తుంది.
పుష్ప మొదటి సక్సెస్ మీట్ ను ముందుగా తిరుపతిలో నిర్వహించారు. ఆ తర్వాత నిన్న సక్సెస్ పార్టీని చెన్నైలో జరిపారు . ఇక ఈరోజు పుష్ప సక్సెస్ పార్టీని కాకినాడలో నిర్వహించనున్నారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రయూనిట్ పుష్పరాజ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇందులో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ నిర్మించారు.
ట్వీట్..
The celebrations continue ??
Gear up for the #PushpaTheRise MASSive Success Party in Kakinada Tomorrow ?#PushpaBoxOfficeSensation @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Mee_Sunil @Dhananjayaka @anusuyakhasba @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/un9DrUbR4T
— Pushpa (@PushpaMovie) December 23, 2021
Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..
Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..
Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీవల్లి సాంగ్.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..