Allu Aravind: హైలెస్సో హైలెస్సా.. స్టూడెంట్స్‌తో మాస్ స్టెప్పులు వేసిన అల్లు అరవింద్.. వీడియో ఇదిగో

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజైంది.

Allu Aravind: హైలెస్సో హైలెస్సా.. స్టూడెంట్స్‌తో మాస్ స్టెప్పులు వేసిన అల్లు అరవింద్.. వీడియో ఇదిగో
Allu Aravind

Updated on: Jan 24, 2025 | 7:40 AM

లవ్ స్టోరీ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. చందూ మొండేటి ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా తండేల్ మూవీ నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గురువారం (జనవరి 24) హైదరాబాద్ శిల్ప కళా వేదికలో స్టూడెంట్స్ మధ్య ‘హైలెస్సో హైలెస్సా’ సాంగ్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. నకాష్‌ అజీజ్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందు, నిర్మాత అల్లు అరవింద్ తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే విద్యార్థులు కూడా సందడి చేశారు. సాంగ్ రిలీజ్ అనంతరం స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు చెప్పుకొచ్చింది. అలాగే ‘హైలెస్సో హైలెస్సా’ పాటకు కొందరు కాలేజీ విద్యార్థులు స్టేజి మీద డ్యాన్స్ చేశారు. వారిని చూసి మురిసిపోయిన అల్లు ఆరవింద్ కూడా ఉత్సాహంగా విద్యార్థులతో స్టెప్పులేశారు. హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి చప్పట్లు, విజిల్స్ వేస్తూ అల్లు అరవింద్ ను ఎంకరేజ్ చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ఇండస్ట్రీలోని టాప్ టెక్నీ షియన్లు తండేల్ చిత్రానికి పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

అల్లు అరవింద్ డ్యాన్స్ వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.