Alia Bhatt: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ బాలీవుడ్ చిలక తెలుగు పలుకులు పలకనుందా..?

|

May 07, 2021 | 2:29 PM

ఏ సిచ్యుయేషన్ని అయినా సరే తన సినిమా ప్రమోషన్‌కు యూజ్‌ చేసుకోవటం రాజమౌళికి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదేమో..?

Alia Bhatt: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ బాలీవుడ్ చిలక తెలుగు పలుకులు పలకనుందా..?
Alia Bhatt
Follow us on

Alia Bhatt: ఏ సిచ్యుయేషన్ని అయినా సరే తన సినిమా ప్రమోషన్‌కు యూజ్‌ చేసుకోవటం రాజమౌళికి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదేమో..? అందుకే ఇండియన్ స్క్రీన్‌ మీద బాహుబలిగా ఎదిగారు ఈ దర్శకధీరుడు. తాజాగా కోవిడ్ సిచ్యుయేషన్‌లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ తన కాస్ట్‌తో ఓ మెసేజ్‌ ఇప్పించారు జక్కన్న.ఇలా అందరు సెలబ్రిటీలు మెసేజ్‌లు ఇస్తున్నారుగా ట్రిపులార్‌ టీమ్ గొప్పేంటి అనుకుంటున్నారా..? అందరిలాగే ఇస్తే ఆయన రాజమౌళి ఎందుకు అవుతారు చెప్పండి. అందరూ మాట్లాడుకునేలా మెసేజ్‌ ఇవ్వడమే ఆయన స్టైల్‌. యస్‌.. ఈ సోషల్ మేసేజ్‌ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.

అందుకు మెయిన్‌ రీజన్‌ అలియా భట్‌. ఈ ముంబై క్యూటీ అచ్చతెలుగులో అందంగా అభిమానులకు తన సందేశాన్ని వినిపించారు. అమ్మడి  స్పష్టమైన తెలుగు చూస్తే ట్రిపులార్ డబ్బింగ్ తానే చెప్పుకోవటం కన్ఫార్మ్ అనిపిస్తోంది. అలియాతో పాటు తమిళ్‌లో చెర్రీ, కన్నడలో ఎన్టీఆర్‌ కూడా అంతే పర్ఫెక్షన్‌ చూపించారు.ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం కూడా ఉంది. అది జక్కన్న వాయిస్‌. ఈ వీడియోలో జక్కన్న మలయాళంలో మాట్లాడారు. తెలుగు దర్శకుడు కాబట్టి తెలుగు వచ్చు.. నేషనల్‌ లాంగ్వేజ్‌ హిందీలో ఎలాగో టచ్‌ ఉంటుంది. ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి తమిళ్ తెలిసి ఉండొచ్చు.. బల్లారి నుంచి వచ్చారు కాబట్టి కన్నడ కూడా తెలుసు.. మరి మలయాళం ఎలా.. అది కూడా అంతా స్పష్టంగా.. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హట్ డిస్కషన్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

Megastar Chiranjeevi : 100 రోజుల ముందుగానే మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు షురూ చేసిన అభిమానులు..

Allu Arjun: పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ తర్వాత ఐకాన్ స్టార్ ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు..?

Nayanthara: ఓటీటీ లో రానున్న లేడీ సూపర్ స్టార్ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు నయన్ ‘నిజల్’