Alia Bhatt: అలియాకు సలహా ఇచ్చిన రాజమౌళి.. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోలేనంటున్న హీరోయిన్..

|

Apr 15, 2023 | 6:42 AM

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది అత్యంత ప్రభావవంతుల జాబితాలో రాజమౌళికి చోటు దక్కింది. దీంతో అభిమానలుు, సినీ ప్రముఖులు జక్కన్నకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడిన అలియా భట్ జక్కన్నపై ప్రశంసలు కురిపించింది.

Alia Bhatt: అలియాకు సలహా ఇచ్చిన రాజమౌళి.. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోలేనంటున్న హీరోయిన్..
Alia Bhatt, Rajamouli
Follow us on

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సెన్సెషన్ క్రియేట్ చేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచాన్ని మొత్తం తనవైపుకు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఎక్కడా చూసిన జక్కన్న పేరు మారుమోగిపోతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‏గా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది అత్యంత ప్రభావవంతుల జాబితాలో రాజమౌళికి చోటు దక్కింది. దీంతో అభిమానలుు, సినీ ప్రముఖులు జక్కన్నకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడిన అలియా భట్ జక్కన్నపై ప్రశంసలు కురిపించింది.

“తొలిసారి రాజమౌళిని బాహుబలి మూవీ ప్రీమియర్ లో కలిశాను. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఆశ్చర్యపోయా. ఎలాగైనా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని కోరుకున్నా. ఆర్ఆర్ఆర్ మూవీతో నా కోరిక నెరవేరింది. ఆయన దగ్గర పనిచేయడమంటే స్కూల్ కు వెళ్లినట్టే. ఎన్నో కొత్త అంశాలు నేర్చుకుంటారు. అందుకే ఆయనను మాస్టర్ స్టోరీ టెల్లర్ అని పిలుస్తాను. నటనలో ఏదైనా సలహా ఇవ్వాలని కోరగా.. ఏ పాత్ర అయినా.. ప్రేమతో చేయాలని చెప్పారు. సినిమా హిట్టు, ప్లాపుతో సంబంధం లేకుండా మన క్యారెక్టర్ ప్రజలకు గుర్తుండిపోయేలా చేయాలన్నారు.” అంటూ రాజమౌళి గురించి చెప్పుకొచ్చారు.

బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాలతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు జక్కన్న. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులను పూర్తిచేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా గ్లోబల్ అడ్వైంచర్ గా ఉండబోతుందని గతంలోనే తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.