
మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మంచు విష్ణు, మంచు మోహన్ బాబు. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో ప్రభాస్, నయనతార నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తాడని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. కానీ ప్రభాస్ ఆ పాత్రలో కనిపించడం లేదని. చిన్న పాత్రలోనే రెబల్ స్టార్ కనిపిస్తారని అంటున్నారు. కాగా కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.
తాజాగా అక్షయ్ కుమార్ శివుడి లుక్ లో ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. శివుడి గెటప్ లో అక్షయ్ ఆకట్టుకున్నారు. అలాగే పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. విష్ణు ప్రధాన పాత్రలో అంటే కన్నప్పగా కనిపించనున్నాడు. గతంలో కన్నప్ప కథపై ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మంచు విష్ణు మరోసారి కన్నప్ప కథను విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
కన్నప్ప సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం ఇలా చాలా మంది నటిస్తున్నారు. ప్రీతి ముకుందన్ కథనాయికగా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో విష్ణు కూతుర్లు, కొడుకు కూడా నటిస్తున్నారు. ఇక అక్షయ్ తాను శివుడి పాత్రలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ పాత్ర తనకు చాలా ప్రత్యేకం అని అన్నారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.