Naga Chaitanya: ఖరీదైన పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించిన నాగ చైతన్య.. ధర ఎంత ఉంటుందో తెలుసా ?..

మత్య్సకారుల జీవితాల ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇక ఇటీవలే ధూత వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు చైతూ. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో జర్నలిస్ట్ పాత్రలో మరోసారి తన నటనతో మెప్పించాడు చైతూ. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న చైతూ..

Naga Chaitanya: ఖరీదైన పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించిన నాగ చైతన్య.. ధర ఎంత ఉంటుందో తెలుసా ?..
Naga Chaitanya

Updated on: Dec 09, 2023 | 5:39 PM

ప్రస్తుతం నాగ చైతన్య.. తండెల్ సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలల క్రితం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ.. ఈరోజు ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. మత్య్సకారుల జీవితాల ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇక ఇటీవలే ధూత వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు చైతూ. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో జర్నలిస్ట్ పాత్రలో మరోసారి తన నటనతో మెప్పించాడు చైతూ. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న చైతూ..ఇప్పటివరకు రూ.154 కోట్లు సంపాదించాడు.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచిన చైతూ..154 కోట్ల రూపాయల నికర విలువను కలిగి ఉన్నాడు. సూపర్ హిట్ సినిమాలే కాకుండా యాడ్స్, బిజినెస్ రంగాల్లోనూ చైతూ భారీగానే సంపాదిస్తున్నాడు. ఆన్-స్క్రీన్ విజయాలతో పాటు, నాగ చైతన్య తన విలాసవంతమైన జీవనశైలికి కూడా ప్రసిద్ది చెందాడు.

చైతూకు కార్స్, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే అతని వద్ద లగ్జరీ కార్లు, బైక్స్ ఉన్నాయి. అలాగే అతని వద్ద ఖరీదైన వాచ్ కలెక్షన్ ఉంది. ఇటీవల చైతూ.. హైదరాబాద్‌లో పాటెక్ ఫిలిప్ వాచ్‌ను ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ విలాసవంతమైన టైమ్‌పీస్ ధర రూ. 74.48 లక్షల ఉంటుందట. ఇప్పుడు ఆ వాచ్ ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్.

నాగ చైతన్య చివరిసారిగా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ధూతలో కనిపించాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. అలాగే త్వరలోనే తండెల్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.