Naga Chaitanya: అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేసిన చైతూ.. ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి అలా..

|

Aug 10, 2024 | 3:57 PM

అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థం గురువారం హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో జరిగిన సంగతి తెలిసిందే. తన తండ్రి నాగార్జున ఇంట్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుకగా జరిగింది. ఈ వేడుక జరిగిన కొన్ని గంటల్లోనే తన పర్సనల్ అసిస్టెంట్ పెళ్లికి హాజరయ్యాడు చైతూ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి

Naga Chaitanya: అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేసిన చైతూ.. ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి అలా..
Naga Chaitanya
Follow us on

అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థం గురువారం హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో జరిగిన సంగతి తెలిసిందే. తన తండ్రి నాగార్జున ఇంట్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుకగా జరిగింది. ఈ వేడుక జరిగిన కొన్ని గంటల్లోనే తన పర్సనల్ అసిస్టెంట్ పెళ్లికి హాజరయ్యాడు చైతూ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. సమంతతో విడాకుల తర్వాత కొన్నాళ్లపాటు ఒంటరిగా ఉన్న చైతూ.. ఆ తర్వాత శోభితాతో ప్రేమలో పడినట్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరు కలిసి విదేశాల్లో సందడి చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా తమ రిలేషన్ షిప్ ను అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే చైతన్య పర్సనల్ అసిస్టెంట్ వెంకటేశ్ పెళ్లి వేడుక రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సందడి చేసిన చైతూ నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.