మాములుగా సినిమాల విషయంలో హీరోల మధ్య పోటీ ఉంటుంది. ఒకే సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోల సినిమాలు పోటీపడుతుంటాయి. ఈసారి కూడా ఇద్దరు హీరోల సినిమాలు బరిలోకి దిగితున్నాయి. అందులో కొత్తేముందనుకుంటున్నారా.. ఈ సారి పోటీపడబోయే హీరోలు అలాంటి ఇలాంటి వారు కాదు అన్నదమ్ములు… అందులోనూ అక్కినేని వారసులు. అవును ఈ ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నాగచైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ, అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తుంది. కరోనా కారణంగా ఇన్ని రోజులు హోల్డ్ లో ఉన్న ఈ రెండు సినిమాలు థియేటర్స్ ఓపెన్ అవ్వగానే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవి చైతూ తో జత కట్టనుంది. అందమైన ప్రేమ కథగా ఈ సినిమాను రూపొందించాడు శేఖర్ కమ్ముల. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్ , పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
ఇప్పటికే షూటింగ్ ముగించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా ను గత ఏడాది లో విడుదల చేయాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సినిమా ను బాక్సాఫీస్ వద్ద కు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. ఇక థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ రెండు సినిమాలు కేవలం వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ చేయనున్నారట. ఆగస్టు 7వ తారీకున నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఆగస్టు 13వ తారీకున అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ను విడుదల చేసేందుకు గాను ప్లాన్ చేస్తున్నారట.
మరిన్ని ఇక్కడ చదవండి :