Ravi Teja’s Ravanasura: రవితేజ సినిమాకోసం రంగంలో అక్కినేని యంగ్ హీరో.. న్యూ లుక్ మాములుగా లేదుగా..

|

Jan 11, 2022 | 9:40 PM

హిట్లు వచ్చిన ఫ్లాప్ లు పలకరించిన రవితేజ జోష్ మాత్రం ఏమాత్రం తగ్గదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఆయన లైన్ లో పెడుతూనే ఉంటారు.

Ravi Tejas Ravanasura: రవితేజ సినిమాకోసం రంగంలో అక్కినేని యంగ్ హీరో.. న్యూ లుక్ మాములుగా లేదుగా..
Raviteja
Follow us on

Ravi Teja’s Ravanasura: హిట్లు వచ్చిన ఫ్లాప్ లు పలకరించిన రవితేజ జోష్ మాత్రం ఏమాత్రం తగ్గదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఆయన లైన్ లో పెడుతూనే ఉంటారు. రీసెంట్ గా క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. త్వరలోనే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్ ను ఓకే చేశాడు. వాటిలో  క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ మూవీ కూడా ఒకటి. ఈ కాంబినేషన్ లో రాబోతున్న సూపర్ క్రేజీ మూవీ రావణాసుర. ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. దీపా‌వళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. రావణాసురలో క‌థానాయ‌కుడు ప‌ది డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపిస్తుండ‌డం విశేషం.

ఇక ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో  అక్కినేని యంగ్ హీరో కనిపించనున్నాడు. సుశాంత్ ఇటీవలే అలవైకుఠపురంలో సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రవితేజ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా సుశాంత్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సుశాంత్ నీలం కళ్ళు పొడవాటి జుట్టు – గడ్డంతో కనిపిస్తున్నాడు. ఈ  పోస్టర్ కి ‘హీరోలు ఉనికిలో లేరు.. కానీ రాక్షసులు ఉన్నారు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమా సంక్రాంతి పండక్కి జ‌న‌వ‌రి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. రావణాసుర చిత్రానికి శ్రీకాంత్ విస్సా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ అందించారు. స్టైలిష్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రంలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించ‌నున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: అల్లు అర్జున్ నిజంగా అదరగొట్టేశాడు .. పుష్ప సినిమా పై తమిళ్ స్టార్ హీరో కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

సినిమాతారలను వదలని మహమ్మారి.. వరుసగా కరోనా బారిన పడుతున్న మూవీ స్టార్స్.. ఆందోళనలో అభిమానులు

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఓ కల్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరో గుర్తుపట్టారా..?