Akhil Akkineni: అయ్యగారు నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా..! అఖిల్ నయా మూవీ ఫిక్స్.?
కింగ్ నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో. ఇంతవరకు సాలిడ్ హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. అఖిల్ వివినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది.ఆ తర్వాత హలో అనే ప్రేమ కథతో వచ్చాడు. ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది. దాంతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను అనే సినిమా చేశాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కూడా అఖిల్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది.

ఎంత స్టార్ హీరో కొడుకులైనా.. కూతురాలైన హిట్ రుచి చూడకపోతే ఇండస్ట్రీలో రాణించడం కష్టమే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఫలితం దక్కకపోతే జనాలు మరిచిపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ యంగ్ హీరో మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిగా సినిమాలు చేస్తూనే.. ఎక్కడా వెనకడుగేయకుండా దూసుకుపోతున్నాడు. అతనే అక్కినేని అఖిల్. కింగ్ నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో. ఇంతవరకు సాలిడ్ హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. అఖిల్ వివినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది.ఆ తర్వాత హలో అనే ప్రేమ కథతో వచ్చాడు. ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది. దాంతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను అనే సినిమా చేశాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కూడా అఖిల్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది.
దాంతో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమా చేశాడు పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పర్లేదు అనిపించుకుంద. హిట్ టాక్ వచ్చినా అది పూజాహెగ్డే ఖాతాలోకే వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో ఏజెంట్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు అఖిల్.
ఏజెంట్ సినిమా పై అఖిల్ ఫ్యాన్స్ గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది. ఫస్ట్ షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ఏజెంట్ సినిమా. దాంతో అఖిల్ సైలెంట్ అయిపోయాడు. ఇక పై కథ విషయంలో జాగ్రత్తలు పాటించాలని గట్టిగానే నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అద్దాలతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో, ముకుంద లాంటి ఫీల్ గుడ్ సినిమాలను అందించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ ప్రేమ కథలో అఖిల్ నటించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
View this post on Instagram
అఖిల్ అక్కినేని ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.