AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agent : శరవేగంగా షూటింగ్.. భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం వైజాగ్‌లో వాలిన ‘ఏజెంట్’..

యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కితున్న సినిమా ఏజెంట్. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌తో గతేడాది సూపర్‌ హిట్‌ను అందుకున్న అఖిల్‌..

Agent : శరవేగంగా షూటింగ్.. భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం వైజాగ్‌లో వాలిన 'ఏజెంట్'..
Akhil
Rajeev Rayala
|

Updated on: Apr 12, 2022 | 6:23 PM

Share

యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్(Akhil Akkineni) హీరోగా స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కితున్న సినిమా ఏజెంట్(Agent). మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌తో గతేడాది సూపర్‌ హిట్‌ను అందుకున్న అఖిల్‌, ఇప్పుడు అదే జోరును కొనసాగించేందుకు ఏజెంట్‌ రూపంలో రానున్నాడు. ఇప్పటి వరకు లవర్‌ బాయ్‌గా కనిపించిన అఖిల్‌ తొలిసారి ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో అఖిల్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్లు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. తాజాగా  ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ వైజాగ్ పోర్ట్ లో మొదలైయింది.

ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించనున్నారు. షూటింగ్ లో భాగంగా వైజాగ్ చేరుకున్న హీరో అఖిల్ కు ఎయిర్ పోర్ట్ లో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అఖిల్ ని చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్ బైక్ భారీ ర్యాలీ కూడా నిర్వహించి తమ అభిమానం చాటుకున్నారు. అభిమానులు నుంచి వస్తున్న ఈ భారీ స్పందన అఖిల్ కి వున్న క్రేజుకి అద్దం పడుతుంది. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. రీసెంట్ గా అఖిల్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన పోస్టర్ కి కూడా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ రచయిత, దర్శకులు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి  

Lata Mangeshkar Award: ప్రధానిని వరించిన తొలి ‘లతా దీనానాథ్‌ మంగేష్కర్‌’ అవార్డు..

Rajamouli: జక్కన్నకు ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు.. గాలిబుడగల థియేటర్లో ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన రాజమౌళి..

KGF 2 Movie: తన వల్లే మీ ముందు ఇలా ఉన్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ స్టార్ యశ్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!