Aakashavani: ఆ గూడెం వాసుల జీవితాలను రేడియో ఎలా మార్చేసింది.. ఆసక్తికరంగా ఆకాశవాణి ట్రైలర్‌.

| Edited By: Ravi Kiran

Sep 21, 2021 | 6:59 AM

Aakashavani Trailer: సముద్రఖని, వినయ్‌ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్‌ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఆకాశవాణి. ఈ సినిమాకు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్‌ గంగరాజు...

Aakashavani: ఆ గూడెం వాసుల జీవితాలను రేడియో ఎలా మార్చేసింది.. ఆసక్తికరంగా ఆకాశవాణి ట్రైలర్‌.
Follow us on

Aakashavani Trailer: సముద్రఖని, వినయ్‌ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్‌ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఆకాశవాణి. ఈ సినిమాకు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్‌ గంగరాజు దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాను ‘సోనీ లైవ్‌’ ఓటీటీ వేదికగా ఈ నెల 24న విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మూవీ యూనిట్‌ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

1:46 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ఆద్యతంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్‌ను గమనిస్తే దర్శకుడు ఇంతవరకు తెలుగులో రాని ఓ విభిన్న కథాంశంతో సినిమాను తెరకెక్కించనట్లు తెలుస్తోంది. ప్రపంచానికి దూరంగా, బయట ఇంకో ప్రపంచం కూడా ఉందని తెలియకుండా కొందరు గూడెం వాసులు నివసిస్తుంటారు. వీరందరినీ ఓ దొర భయపెట్టిస్తుంటాడు. గూడెంలో ఉన్న ప్రజలను అడవి దాటకుండా చూస్తుంటాడు. అయితే ఇదే సమయంలో గూడెంలోని ఓ కుర్రాడికి అనుకోకుండా ఓ రేడియో దొరుకుతుంది.

ఇంతకీ ఆ రేడియో ఎక్కడి నుంచి వచ్చింది.? దాని వల్ల ఆ గూడెం వాసుల జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నదే సినిమా ఇతివృత్తం. ట్రైలర్‌ను గమనిస్తే సినిమాను అత్యంత సహజమైన లొకేషన్‌లో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. విభిన్న కథాంశంతో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ ట్రైలర్‌పై మీరూ చూసేయండి మరి..

ప్రభాస్‌ చేతుల మీదుగా..

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చేతుల మీదుగా విడుదల చేయడం మరో విశేషం. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం ప్రభాస్‌ సినిమా ట్రైల‌ర్ చాలా బావుందని, సినిమా ఇన్నోవేటివ్‌గా అనిపిస్తుందని, సినిమా పెద్ద హిట్ కావాల‌ంటూ ప్రభాస్ చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

Also Read: Samantha: అన్ని పుకార్లను సమంత ఒక్క ట్వీట్‌తో పటా పంచలు చేసిందా.! ఇంతకీ సామ్‌ చేసిన ఆ ట్వీట్ ఏంటో తెలుసా.?

Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..

డిస్నీ+హాట్‌ స్టార్‌ ఓటీటీకి బ్రాండ్‌ అండాసిడర్‌గా రామ్‌చరణ్‌.. నాగార్జున మరియు ‘మ్యాస్ట్రో’ మూవీ టీం ఫొటోస్..